Sri Ramanavami: శ్రీ రాముడి రాశి ఏంటి? ఏ రాశి వారిలో రాముడి లక్షణాలు ఉంటాయి?

Published : Mar 26, 2026, 05:53 PM IST

Sri Ramanavami: శ్రీ రాముడు జన్మించిన రోజున మనం రామ నవమి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రాశి ఏంటి? ఆయన రాశిలో జన్మించిన వారికి రాముని లక్షణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయో లేదో తెలుసుకుందాం.. 

PREV
13
Lord Rama

త్రేతా యుగంలో శ్రీ రాముడు చైత్ర శుక్ల నవమి రోజున జన్మించారు. ఈ రోజునే మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటున్నాం. వాల్మీకి రామాయణం ప్రకారం, శ్రీరాముడు కర్కాటక లగ్నం, కర్కాటక రాశిలో జన్మించారు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. శ్రీరాముడు జన్మించిన నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రానికి గురుడు అధిపతి. చంద్రుడు, గురు గ్రహాల కలయిక గజకేసరి యోగాన్ని ఏర్పరుస్తుంది. జోతిష్య శాస్త్రంలో గజకేసరి రాజయోగం అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. ఈ యోగం అపారమైన సంపద, శ్రేయస్సు, కీర్తిని ప్రసాదిస్తుంది.

అంతేకాదు, శ్రీరాముడు కర్కాటక లగ్నంలో జన్మించాడు. అతని రాశి కూడా కర్కాటకమే. అంతేకాకుండా, రాముని జాతకంలో శని తన ఉచ్చరాశి అయిన తుల రాశిలో, కుజుడు తన ఉచ్చ రాశి అయిన మకర రాశిలో ఉన్నారు. కుజుడు శ్రీరాముని వివాహ స్థానంలో ఉన్నాడు. ఈ కారణంగానే ఆయన తన వైవాహిక జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు.

23
కర్కాటక రాశివారి లక్షణాలు ఎలా ఉంటాయంటే...

1.సున్నితమైన వ్యక్తులు..

కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. చంద్రుడు.. మనస్సు, భావోద్వేగాలకు సూచిక. చంద్రుడి ప్రభావం వల్ల.. కర్కాటక రాశివారు చాలా సున్నితంగానూ, ఎమోషనల్ గానూ ఉంటారు. ఇతరులు బాధ పడటాన్ని వీరు సహించలేరు. వీరు ప్రతి విషయాన్ని మనసుతో ఆలోచిస్తారు. వీరు సంబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఒకరితో బంధం ఏర్పరుచుకుంటే.. తమ ప్రాణం పోయే వరకు విడిచిపెట్టరు.

2.శ్రద్ధ, రక్షణ గుణం..

కర్కాటక రాశివారు ఇతరుల పట్ల కూడా చాలా శ్రద్ధతో ఉంటారు. వారు తమ ప్రియమైన వారిని మరింత ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటారు. వారిని రక్షించడానికి ఎంత దూరమైనా వెళతారు. వారు తమ కుటుంబం పట్ల అత్యంత భక్త భావన కలిగి ఉంటారు. కేవలం తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తి ని మాత్రమే కాదు.. తమ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, పిల్లలు అందరి ని జాగ్రత్తగా చూసుకోవాలని పరితపిస్తూ ఉంటారు. అందరితోనూ చాలా నమ్మకంగా ఉంటారు.

33
3.ఊహాత్మక, సృజనాత్మకత..

ఈ రాశికి చెందిన వారు చాలా ఊహాత్మకంగా ఉంటారు. కొన్నిసార్లు ఏదో ఆలోచనలో మునిగిపోయినట్లు కనిపిస్తారు. కానీ.. చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. అయితే, వారి మనోభావాలు తరచుగా మారుతుంటాయి, దీనివల్ల వారి ఇష్టాలు కూడా తరచుగా మారుతుంటాయి. వారు అకస్మాత్తుగా సంతోషంగా , అకస్మాత్తుగా విచారంగా కూడా మారగలరు.

4.కష్టపడి పనిచేసే తత్వం, తెలివైనవారు: కర్కాటక రాశి వారు కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా చాలా తెలివిగా కూడా ఉంటారు. చేసే పని పట్ల చాలా నిబద్ధతతో ఉంటారు. డబ్బు ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలి? ఎక్కడ ఎలా ఆదా చేయాలో వీరికి బాగా తెలుసు.

Read more Photos on
click me!

Recommended Stories