Ugadi 2025: విశ్వావసు నామ సంవత్సరంలో ఈ రాశులకు డబ్బే డబ్బు..!
విశ్వావసు నామ సంవత్సరం వస్తూ వస్తూ కొన్ని రాశులకు అదృష్టాన్ని తేనుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం..
విశ్వావసు నామ సంవత్సరం వస్తూ వస్తూ కొన్ని రాశులకు అదృష్టాన్ని తేనుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం..
విశ్వావసు నామ సంవత్సరం లోకి మన మంతా అడుగుపెట్టబోతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో గ్రహాలు స్థానాలు మార్చుకుంటూ ఉంటాయి. ఈ గ్రహాల మార్పుల వల్ల సూర్యుడు మేష రాశిలో సంచరించనున్నాడు. గురుడు వృషభంలో , కుజుడు కర్కాటకంలో, కేతువు కన్య రాశిలో, చంద్రుడు తుల రాశిలో సంచరించనున్నాడు. అంతేకాకుండా.. ఈ కొత్త సంవత్సర ప్రారంభంలో శని, శుక్ర, బుధ, రాహు గ్రహాలు మీన రాశిలో సంచరించనున్నాయి. దీని ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..
మకర రాశి కొత్త సంవత్సరం రాశి ఫలం:
ఈ రాశికి కొత్త సంవత్సరం మంచి ఫలితాలు ఇచ్చే సంవత్సరం అవుతుంది. మకర రాశి వారు కొంచెం కొంచెంగా ఫలితాన్ని అనుభవిస్తారు. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా మీ జీవితంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగం చేసేవారైతే ఉద్యోగంలో పురోగతి చూడవచ్చు. ఆదాయానికి మార్గం దొరుకుతుంది. దీనివల్ల ఆర్థిక సమస్య మెరుగుపడుతుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో పురోగతి ఉంటుంది.
కన్య రాశి కొత్త సంవత్సరం ఫలితం:
కన్య రాశికి కొత్త సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. శని దేవుడి దయ, ఆశీర్వాదం మీకు లభిస్తాయి. ఉద్యోగం బాగుంటుంది. పనిలో పదోన్నతి, జీతం పెరుగుదల ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగంలో రెట్టింపు లాభం వస్తుంది. విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
ధను రాశి కొత్త సంవత్సరం ఫలితం:
ధను రాశికి విశ్వావసు నామ సంవత్సరంలో మీకు చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి. గురు సంచారం మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. జీవితం పురోగతి బాటలో సాగడం మీరు కళ్లారా చూడవచ్చు. అయినప్పటికీ, మీ చుట్టూ ఉన్నవారి గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి కొత్త సంవత్సరం ఫలితం:
వృషభ రాశికి కొత్త సంవత్సరం చాలా మంచి విషయాలను తీసుకురానుంది. అన్ని పనుల్లో మీకు విజయం లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మిథున రాశి కొత్త సంవత్సరం ఫలితం:
మిథున రాశికి కొత్త సంవత్సరంలో జరగనున్న శని, గురు సంచారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. పనిలో పురోగతి ఉంటుంది. కొత్త ఉద్యోగం ప్రారంభిస్తారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ప్రేమ జీవితంలో సంతోషం, పురోగతి ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.