Dream: అక్షయ తృతీయ వేళ మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ పంట పండినట్లే..!

Published : Apr 18, 2026, 11:46 AM IST

 Dream: హిందూ మతంలో అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజున వచ్చే కలలు కూడా మన జీవితాన్ని మార్చేస్తాయి. మరి, మీకు కలలో ఏం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? 

PREV
13
అక్షయ తృతీయ..

అక్షయ తృతీయ అనగానే అందరూ ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. లేదంటే.. ఇంట్లో లక్ష్మీ దేవి అడుగుపెట్టాలని.. ఆ అమ్మవారిని పూజిస్తారు. అంతేకాదు.. ఈ రోజున ఏదైనా శుభకార్యం చేసినా, దాన ధర్మాలు చేసినా రెట్టింపు ఫలితాలు పొందుతారు. అయితే.. ఈ పర్వదినానికీ కలలకు కూడా సంబంధం ఉంది. ఈ సమయంలో వచ్చే కలలు మన భవిష్యత్తుకు సంబంధించిన శుభ సంకేతాలు సూచిస్తాయి. మరి, మీ కలలో ఏం కనిపిస్తే.. మీకు శుభం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం...

23
మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా?

1.బంగారం లేదా ఆభరణాలు...

అక్షయ తృతీయ ముందు రోజుగానీ, ఆ రోజు గానీ బంగారం, వెండి లేదా ఏదైనా ఆభరణాలు మీ కలలో కనిపిస్తే.. మీ జీవితంలో కనక వర్షం కురిసినట్లే. ధన లాభం కలుగుతుంది. ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు అందే అవకాశం ఉంది.

2.లక్ష్మీ దేవి కలలో కనిపించడం...

అక్షయ తృతీయ ముందు గానీ, ఆ రోజు కానీ మీ కలలో లక్ష్మీ దేవి కనపడితే... మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. సంపద పెరుగుతుంది. ఆ లక్ష్మీ దేవి కటాక్షం మీరు పొందుతారు. అదృష్టం రెట్టింపు అవుతుంది.

33
స్వచ్ఛమైన నీటిని చూడటం...

స్వచ్ఛమైన నీరు, ప్రవహించే నది లేదా జలపాతాన్ని కలలో చూడటం మానసిక ప్రశాంతతకు, జీవితంలో సానుకూల మార్పులకు సంకేతంగా భావిస్తారు. రాబోయే కాలంలో ప్రశాంతంగా, సమతుల్యంగా ఉంటుందని ఈ కల సూచిస్తుంది.

గుడికి వెళ్లడం, పూజ చేయడం..

మీ కలలో టెంపుల్ కనిపించినా, లేదా మీరు ఏదైనా పూజ చేస్తున్నట్లు కనిపించినా.. మీరు త్వరలోనే శుభవార్తలు వింటున్నారు అని అర్థం. కొత్త శుభ అవకాశాలకు సంకేతంగా పరిగణిస్తారు. జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది.

సూర్యుడిని లేదా కాంతిని చూడటం

మీ కలలో ఉదయిస్తున్న సూర్యుడిని లేదా ప్రకాశవంతమైన కాంతిని చూడటం జీవితంలో కొత్త అవకాశాలకు, విజయానికి, నూతన ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు. ఇది భవిష్యత్తులో లభించే పురోగతిని, విజయాలను సూచిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories