మనం జన్మించిన తేదీ ఆధారంగా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడానికి న్యూమరాలజీని ఉపయోగిస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం ఒక మనిషి వ్యక్తిత్వం, వారి ఆలోచన తీరుపై వారు పుట్టిన తేదీ కచ్చితంగా ప్రభావం చూపుతుందని చెబుతుంటారు. న్యూమరాలజీలో కొన్ని తేదీలను రాడిక్స్ నెంబర్లుగా విభజించారు. రాడిక్స్ నెంబర్ 4, 7లలో జన్మించిన వారి జీవితంలో చాలా ట్విస్టులు ఉంటాయి. ముఖ్యంగా వీరితో జీవించడం చాలా కష్టం, అంతేకాదు వీరితో బంధం ప్రమాదకరమని కూడా శాస్త్రం చెబుతోంది.
రాడిక్స్ 4,7 నెంబర్లకు రాహువు అధిపతిగా ఉంటాడు. అలాగే వీరిపై కేతులు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో వీరి ఆలోచన తీరు చాలా వైవిధ్యంగా ఉంటుంది. వీరిని అర్థం చేసుకోవడం కష్టం. వ్యక్తిగతంగా ఉన్నత స్థానానికి చేరుకున్నా వీరిని నమ్ముకున్న వారిని, ముఖ్యంగా వీరితో బంధంలో ఉన్న వారిని మోసం చేసే స్వభావం వీరిలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. రాడిక్స్ 4, 7లలో ఏయే తేదీలు ఉంటాయి.? వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది.? ఇప్పుడు తెలుసుకుందాం.
రాడిక్స్ నెంబర్ 4:
4,13, 22 తేదీల్లో జన్మించిన వారు రాడిక్స్ నెంబర్ 4 కిందికి వస్తారు. వీరిపై రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యక్తిగతంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మంచి వ్యాపారవేత్తగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కానీ వీరిలో చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. త్వరగా చెడు అలవాట్లకు బానిసలుగా మారే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా గ్యాంబ్లింగ్, డ్రగ్స్ వాటికి అలవాటు పడుతారు. అలాగే వీరు తమ భాగస్వామితో కూడా నిజాయితీగా ఉండరు. ఒకటి కంటే ఎక్కవ మందితో రిలేషన్‌లో ఉంటారు. ఈ తేదీల్లో జన్మించిన వారు విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
రాడిక్స్ నెంబర్ 7:
7,16,25 తేదీల్లో జన్మించిన వారు రాడిక్స్ నెంబర్ 7 జాబితాలోకి వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు చాలా మంచి వారు కానీ కష్టాలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా భాగస్వామితో నిజాయితీగా ఉంటారు. కానీ వీరిని ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోలేరు. ప్రేమలో విఫలమవుతుంటారు. జీవిత భాగస్వామితో మనస్ఫర్థాలు ఎక్కువగా వస్తుంటాయి. ప్రేమ జీవితంలో, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా, పలువురు పండితులు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి. అలాగే ఈ తేదీల్లో జన్మించిన అందరి స్వభావం ఇలాగే ఉంటుందని కచ్చితంగా చెప్పలేం.