
బాబా వంగా జోస్యం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఆమె చెప్పిన విషయాలు గతంలో చాలానే జరిగాయి. మరి.. బాబా వంగా ప్రకారం... 2026 ఎలా ఉండనుంది..? మరీ ముఖ్యంగా... ఏ రాశుల వారికి కొత్త సంవత్సరం బాగా కలిసి రానుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బాబా వంగా ప్రకారం 2026లో మేష రాశిలో జన్మించిన వారు సహజంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. సాహసాలు చేయడానికి ఇష్టపడతారు. ఈ నూతన సంవత్సరం వీరి కలలు నిజమౌతాయి. సాహసాలు చేయాలన్న వీరి కోరిక నెరవేరుతుంది. ఈ ఏడాది మీరు ఏ పని మొదలుపెట్టాలన్నా... అందుకు తగినట్లుగా మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం చేసే వారికి ఈ ఏడాది ప్రమోషన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి కూడా ఇదే సరైన సమయం. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. ఈ సంవత్సరం మేష రాశివారు చాలా తక్కువ సమయంలో లక్షాధికారి అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే... ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.
బాబా వంగా ప్రకారం.. వృషభ రాశి వారికి 2026 చాలా బాగా కలిసొస్తంది. వారు పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. మంచి లాభాలు కూడా పొందుతారు. పెద్ద పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ వంటి వాటి నుంచి భారీ లాభాలు పొందుతారు. కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందం, శాంతి పెరుగుతాయి. అయితే... ఆదాయం ఎంత పెరిగినా, ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచి తూచి ఖర్చు చేస్తే.. సంపద పెరుగుతుంది.
2026 వస్తూనే మిథున రాశివారి జీవితంలోకి అనేక ప్రయోజనాలను మోసుకురానుంది. ఈ సమయంలో మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. సంపదను పొందుతారు. డిజిటల్ వ్యాపారం, ఆన్ లైన్ వ్యాపారులు పెద్ద పురోగతి సాధించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నా.. ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు బుధవారం రోజున గణేశుడిని పూజించడం శుభప్రదం. ఈ రాశివారికి పసుపు రంగు శుభప్రదం.
సింహరాశిలో జన్మించిన వారికి 2026 అదృష్ట సంవత్సరంగా మారనుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల లభిస్తుంది. ఈ కాలంలో, మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. మీరు అపారమైన లాభాలను పొందుతారు. వ్యాపారాలు చేసేవారు లక్షాధికారి లేదా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో సింహరాశిలో జన్మించిన వ్యక్తుల ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో, సింహరాశిలో జన్మించిన వ్యక్తులు తమ కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అలాగే, ఆదివారం, మీరు సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారి అదృష్ట రంగు బంగారు వర్ణం.
బాబా వంగా అంచనాల ప్రకారం, కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు 2025 లో AI లేదా మరే ఇతర రంగంలోనైనా విజయం సాధిస్తారు. ఈ కాలంలో, మీరు పాత ఆలోచనలను కొత్తవిగా మార్చడానికి మంచి అవకాశాన్ని పొందుతారు. మీరు చాలా డబ్బు , సంపదకు యజమాని అవుతారు. సామాజిక సేవలో మీరు గరిష్ట ప్రయోజనాలను పొందుతారు. అలాగే, కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ స్నేహితులతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. కానీ ఆ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ కాలంలో వారి నిద్రపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. 2026 శుభప్రదంగా మారాలంటే, కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులు శనివారం నువ్వులను దానం చేయాలి. అలాగే, కుంభ రాశిలో జన్మించిన వ్యక్తుల అదృష్ట రంగు నీలం.