15వ తేదీ..
ఏ నెలలో అయినా 15వ తేదీలో పుట్టిన వారు చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. రాజసం ఉట్టిపడేలా ఉంటారు. ఈ తేదీలో పుట్టిన వారికి శుక్ర గ్రహం అధిపతి.
వ్యక్తిత్వం: వీరి మాటల్లో, చూపుల్లో ఒక మంత్రముగ్ధమైన ఆకర్షణ ఉంటుంది. ఇతరులు వీరిలా ఉండాలని లేదా వీరితో స్నేహం చేయాలని కోరుకుంటారు. వీరిలోని దౌత్య స్వభావం , మర్యాదపూర్వక ప్రవర్తన కారణంగా.. ఇతరులకు సాధ్యం కాని క్లిష్టమైన పనులు కూడా వీరికి సులభంగా జరిగిపోతాయి. కీర్తి వీరికి అలంకారంలా మారుతుంది.