Rahu ketu Gochar: ఒకే రోజున నక్షత్రం మారుతున్న రాహుకేతువులు, ఈ 4 రాశులకు సంపదే సంపద

Published : Feb 12, 2026, 12:51 PM IST

Rahu ketu Gochar: రాహు కేతువులను దుష్ట గ్రహాలుగా చెప్పుకుంటారు. కానీ అవి కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు మంచి ఫలితాలను అందిస్తాయి. త్వరలో రాహుకేతువులు ఒకే రోజున తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. దీనివల్ల 4 రాశులకు విపరీతంగా కలిసి వస్తుంది. 

PREV
15
రాహు కేతువుల గమనం

చెడు గ్రహాలుగా రాహుకేతువులను చెప్పుకుంటారు. ఆ రెండూ తమ గమనాన్ని అతి త్వరలో మార్చుకోబోతున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం మార్చి 29న కేతువు మాఘ నక్షత్రంలోకి ప్రవేశిస్తే, రాహువు శతభిషా నక్షత్రంలో రెండవ దశలో సంచారం చేస్తాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి బాగా కలిసొస్తుంది. రాహుకేతు సంచారం నాలుగు రాశుల వారికి అన్ని రకాలుగా పురోగతికి సహకరిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

25
మేష రాశి

రాహు కేతువుల నక్షత్ర మార్పుల వల్ల మేష రాశి వారికి విపరీతంగా కలిసిస్తుంది. వీరికి ఆకస్మికంగా ఆర్థికంగా లాభాలు వచ్చి పడతాయి. ఇంట్లో ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ రాశివారు మాట్లాడితే వినడానికి ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. పనిచేసే చోట అందరిని ఆకట్టుకుంటారు. ఉద్యోగం చేస్తున్న వారి ఆలోచనలకు చుట్టూ ఉన్నవారు ఎంతో ఆకర్షితులవుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే అవి మీకు ప్రయోజనాలను తెచ్చిపెడతాయి. వీరి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

35
మిథున రాశి

ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా పెరుగుతుంది. ఆస్తిని కొనేందుకు కానీ అమ్మడానికి గాని ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కోర్టులో ఏమైనా కేసులు ఉంటే అవి వీరికే అనుకూలంగా వస్తాయి. ఇక చాలా కాలంలో పెండింగులో పడి ముందుకు సాగకుండా ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. వీరి మనస్సు సంతోషంతో నిండిపోతుంది. అలాగే వీరి జీవితంలోని అనుబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయాణిస్తారు. జీవిత భాగస్వామితో ప్రయాణాన్ని ప్లాన్ చేసే అవకాశం ఉంది.

45
వృశ్చిక రాశి

ఒకే రోజున రాహుకేతువులు నక్షత్రాలు మారడం అనేది వృశ్చిక రాశి వారికి ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. శత్రువులపై వీరు విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. పొదుపు పై దృష్టి పెడతారు. పెట్టుబడి కూడా వీరికి కలిసివస్తుంది. ఆరోగ్యంలో కాస్త ఇబ్బందులు ఉన్న అవన్నీ మెరుగుపడతాయి. ప్రేమ సంబంధాలు ఆనందంతో నిండిపోతాయి. మీపై కుట్రలు చేసేవారు ఓడిపోతారు.

55
మీన రాశి

మీన రాశి వారికి సంపద విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వీరు చాలా సులువుగా డబ్బు సంపాదిస్తారు. ఖర్చులు కూడా తగ్గించుకుంటారు. దీని వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లోని పెద్దలతో కొనసాగుతున్న విభేదాలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ఈ రాశివారి ప్రేమకు అంగీకారం దొరుకుతుంది. కుటుంబం ఐక్యంగా ఉంటుంది. విదేశీ పర్యటనలు చేసే అవకాశం కూడా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories