1.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. చాలా సెన్సిటివ్ కూడా.జీవితం ప్రశాంతంగా ఉన్నా కూడా చిన్న చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటారు. తమ స్నేహితులు, బంధువులు, ప్రేమించిన వారు దూరమైపోతారేమో అనే భయం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉంటారు. ఏ పని చేసినా ఫెయిల్ అయిపోతామేమో అని వీరు భయపడతారు. తమకు తెలిసినవాళ్లు కాస్త తేడాగా ప్రవర్తించినా కూడా నెగిటివ్ గా ఆలోచించేస్తారు. అతి జాగ్రత్త కారణంగా వీరు ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ, ఈ రాశివారు కాస్త పాజిటివ్ గా ఉండి, వారిని వారు నమ్ముకొని మనశ్శాంతిగా ఉంటే.. జీవితం సంతోషంగా ఉంటుంది.