జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కలయికలు ఎంతో ముఖ్యమైనవి. ఒకే రాశిలో లేదా నక్షత్రంలో కొన్ని గ్రహాలు కలిస్తే అవి వ్యక్తల జీవితాలపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. 2026 జనవరి నెలలో శుక్రుడు, మంగళుడు ఒకరికొకరు అత్యంత సమీపంగా రాబోతున్నారు. దీన్ని గ్రహ యుద్ధంగా చెప్పుకుంటారు. శుక్రుడు సుఖసంతోషాలు, ప్రేమ, సంపదకు కారకుడు కాగా.. కుజుడు ఆవేశం, ధైర్యం, కోపానికి సూచిక. ఈ రెండు గ్రహాల శక్తులు ఎదురెదురుగా ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి, అనవసర వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.
జనవరి 6 నుంచి జనవరి 10 మధ్య ఈ శుక్రుడు, కుజుడు ఒకరికొకరు దగ్గరగా వస్తారు. దీని వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో చిన్న విషయాలకే కోపం రావడం, నిర్ణయాల్లో తొందరపాటు కనిపించవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో మాటల తగాదాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.