Shani Amavasya: శని అమావాస్య ఈ ఐదు రాశుల జీవితాన్ని మార్చేస్తుంది..!
2025 లో మొదటి శని అమావాస్య వస్తోంది. ఈ అమావాస్య 5 రాశుల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకురానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..
2025 లో మొదటి శని అమావాస్య వస్తోంది. ఈ అమావాస్య 5 రాశుల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకురానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..
శని అమావాస్య 2025 : శని అమావాస్య రాబోతోంది. మార్చి 28వ తేదీన ఈ అమావాస్య రానుంది. ఈ అమావాస్య వస్తూ వస్తూ.. కొన్ని రాశుల జీవితాలను మార్చనుంది. ఈ రోజున రెండున్నర సంవత్సరాల తర్వాత శని దేవుడు రాశిని మార్చుకుంటున్నాడు. దీని వల్ల ఐదు రాశులకు అదృష్టయోగం కలగనుంది. వారికి శని దేవుడి దయ వల్ల అన్నీ మంచే జరిగే అవకాశం ఉంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా..
మేష రాశి
శని అమావాస్య మేష రాశి వారికి మేలు చేయనుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన విద్యార్థులకి చాలా మంచిది. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేవాళ్లకి కూడా చాలా మంచిది. ఈ సూర్య గ్రహణం మేష రాశి వాళ్లకి డబ్బు విషయంలో చాలా లాభదాయకంగా ఉంటుంది. సూర్య గ్రహణం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్లకి మంచి టైం నడుస్తోంది. మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. సూర్య గ్రహణం మీ రాశిలో ఉండటం వల్ల మంచి జరుగుతుంది. ఈ టైంలో మీ ఖర్చులు అదుపులో ఉంటాయి.
తులారాశి
ఏదైనా చట్టపరమైన విషయాల్లో స్నేహితుల సహాయం అందుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గ్రహణం తులా రాశి వాళ్లకి చాలా మంచిది, లాభదాయకం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
మకర రాశి
మకర రాశి వాళ్లకి ఏలినాటి శని చివరి దశ నడుస్తోంది. ఈ శని అమావాస్య వల్ల శని దేవుడి దయతో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగం చేసేవాళ్లకి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం. రోజు బాగుంటుంది.
మీన రాశి
శని దేవుడు మీ మీద ప్రత్యేక దృష్టి పెడతాడు. ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం పొందొచ్చు. శని అమావాస్య, సూర్య గ్రహణం రెండూ చాలా ముఖ్యం. ఈ రాశుల అదృష్టం తెరుచుకుంటుంది. ఈ ఐదు రాశుల తలరాత మారుతుంది. డబ్బు వర్షం కురుస్తుంది. ఈ ఐదు రాశుల జీవితాలలో మంచి మార్పు వస్తుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా మంచి మార్పు వస్తుంది.