Zodiac sign: ఈ రాశి అమ్మాయిలు వయసులో పెద్దవారితో డేటింగ్ చేస్తారు
ఈ రాశి అమ్మాయిలు వయసులో తమకంటే చాలా పెద్దవారిని ఎక్కువగా ఇష్టపడతారట. మరి, ఆ రాశులేంటో చూద్దాం..
ఈ రాశి అమ్మాయిలు వయసులో తమకంటే చాలా పెద్దవారిని ఎక్కువగా ఇష్టపడతారట. మరి, ఆ రాశులేంటో చూద్దాం..
1.వృషభ రాశి..
వృషభ రాశికి శుక్రుడు అధిపతి. ఈ గ్రహం సౌకర్యం, స్థిరత్వం, భద్రతతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశివారు శుక్రుడి ప్రభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి, ఈ రాశి వారు చాలా సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా, వారు ఎల్లప్పుడూ జీవితంలో స్థిరంగా ఉండాలని కోరుకుంటారు. స్థిరమైన సంబంధాన్ని కోరుకుంటారు. వయసు పైబడిన వారిని భాగస్వాములుగా ఎంచుకోవడానికి ఇది కూడా ఒక కారణం. ముఖ్యంగా అమ్మాయిలు.. వయసులో తమకన్నా చాలా పెద్ద వారితో డేటింగ్ చేయడాన్ని ఇష్టపడతారు. పెద్దవారు అయితే వారికి అనుభవం ఎక్కువగా ఉంటుందని, వారితో సంతోషంగా ఉండొచ్చని వారు నమ్ముతారు.
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారు తమ ప్రియమైన వారిని చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటారు. అంతేకాకుండా, ఎవరైనా తమను ప్రేమగా చూసుకోవాలని వారు ఎల్లప్పుడూ కోరుకుంటారు. తమకంటే పెద్దవారు శ్రద్ధగా, ప్రేమగా ఉంటారని వారు నమ్ముతారు. అందుకే వారు వయసు పైబడిన వారితో డేటింగ్ చేయడానికి ఇష్టపడతారు. వయసు పైబడిన భాగస్వామి తమను బాగా చూసుకోవడమే కాకుండా, ఎల్లప్పుడూ అవసరమైన భద్రతను అందిస్తారని వారు ఆశిస్తారు. వారు తాత్కాలిక సంబంధాలకు కట్టుబడి ఉండరు. వయసు పైబడిన వారికి జీవితం గురించి బాగా తెలుసు అని నమ్ముతారు. కాబట్టి వారితో జీవితం బాగుంటుందని వారు భావిస్తారు.
కుంభ రాశి..
కుంభ రాశి వారు జీవితంలో దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. వారు ఎల్లప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ఈ రాశి అమ్మాయిలు పెద్దవారితో స్నేహం చేయడానికి ఇష్టపడతాడు. ఈ రాశిచక్ర గుర్తుకు స్నేహితులు చాలా ముఖ్యం. వారు స్నేహితులతో కొత్త విషయాలు నేర్చుకోవడం ఆనందిస్తారు. కుంభ రాశి వారు తమకంటే పెద్దవారితో స్నేహం చేస్తే వారి నుండి చాలా నేర్చుకోవచ్చని నమ్ముతారు. వయసు పైబడిన వారికి జీవితం గురించి తెలుసు అని వారు భావిస్తారు. అందుకే వారు వారితో డేటింగ్ చేయడానికి ఇష్టపడతారు.
వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారు తమ జీవితం గురించి చాలా ఆసక్తిగా ఉంటారు. వారు జీవితంలో అనేక విషయాలు చూసిన, అనుభవించిన వ్యక్తులతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. ఈ వ్యక్తులు తమకంటే వయస్సులో పెద్దవారిని ప్రేమిస్తారు, వారి నుండి వారు జీవితం గురించి అనేక విషయాలు నేర్చుకుంటారు. వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అందుకే తమకంటే వయసు పైబడిన వారిని ఆకర్షిస్తారు.