కోయి చేపలను ధైర్యం, పట్టుదల, విజయానికి చిహ్నంగా భావిస్తారు. అవి అడ్డంకులను అధిగమించి ముందుకు సాగే సామర్థ్యాన్ని సూచిస్తాయి. వివిధ రంగుల్లో లభించే కోయి చేపలు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన అర్థాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, బంగారు కోయి సంపద, శ్రేయస్సును సూచిస్తే.. తెలుపు, ఎరుపు కోయి చేపలు అదృష్టాన్ని సూచిస్తాయంట. అయితే.. ఈ చేపలను పెంచాలంటే పెద్ద ట్యాంక్ అవసరం.