
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ 'కాపు' కీలక నేతలకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ) ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. కాపు సామాజిక వర్గంపై వైఎస్ఆర్‌సీపీ ఫోకస్ పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2024 ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే విడుదలయ్యే అవకాశం ఉందే ప్రచారం సాగుతుంది.ఈ తరుణంలో ఎన్నికలకు ప్రధాన పార్టీలు సన్నద్దమౌతున్నాయి.
also read:పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి. సంక్రాంతి తర్వాత ఈ రెండు పార్టీలు సీట్ల సర్ధుబాటుపై ప్రకటన చేయనున్నాయి. ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరుతుందా లేదా అనేది సంక్రాంతి తర్వాత తేలనుంది.
also read:గెలుపు గుర్రాలకే టిక్కెట్లు: వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితా ఇదీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం కూడ కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలపై ఫోకస్ పెట్టింది.
also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్‌సీపీలోకి ఆహ్వానిస్తున్నారనే చర్చ సాగుతుంది. రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. ఇందులో భాగంగానే 2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఆయన అభిమానులు, కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్ద ఎత్తున చేరుకొన్నారు. రాజకీయ రంగ ప్రవేశం గురించి ముద్రగడ పద్మనాభం ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన అభిమానులు చెబుతున్నారు.
also read:జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
ముద్రగడ పద్మనాభం తనయుడు చల్లారావును ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దింపాలని భావిస్తున్నారనే ప్రచారం సాగుతుంది. తుని నుండి ముద్రగడ పద్మనాభం కోడలును బరిలోకి దింపాలని ముద్రగడ పద్మనాభం భావిస్తున్నారనే ప్రచారం సాగుతుంది. రెండు అసెంబ్లీ స్థానాలను ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్‌సీపీ నాయకత్వాన్ని అడిగినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చేందుకు వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం సానుకూలంగా ఉందని చెబుతున్నారు. ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ గా పాల్గొనే విషయమై రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉంది.
also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు
మరో వైపు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను తిరిగి వైఎస్ఆర్‌సీపీలోకి ఆ పార్టీ నాయకత్వం ఆహ్వానిస్తుంది. రెండు రోజుల క్రితం వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి వంగవీటి రాధాతో భేటీ అయ్యారు . వైఎస్ఆర్‌సీపీలో చేరాలని ఆహ్వానించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీని వంగవీటి రాధా వీడారు. తెలుగు దేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా కూడ వంగవీటి రాధా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారానికి దూరమైంది. తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో వంగవీటి రాధా అంత యాక్టివ్ గా కూడ లేరు.
also read:ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వంగవీటి రాధా పాల్గొన్నారు. ఇటీవల కాలంలో మిథున్ రెడ్డి వంగవీటి రాధాతో భేటీ కావడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు దేశంతో పొత్తు పెట్టుకున్నాడు. దీంతో కాపు సామాజిక వర్గం ఓట్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు గాను ముద్రగడ పద్మనాభం, వంగవీటి రాధాలకు వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం గాలం వేస్తుందనే అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీలో చేరే విషయాన్ని వంగవీటి రాధా ఇంకా స్పష్టత ఇవ్వలేదనే ప్రచారం సాగుతుంది.
also read:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?