కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?

First Published | Dec 31, 2023, 12:11 PM IST

కడప పార్లమెంట్ స్థానం నుండి  వై.ఎస్. షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది.  వచ్చే ఏడాది జనవరి మాసంలో వై.ఎస్. షర్మిల  కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై  కాంగ్రెస్ పార్టీ  ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరి వై.ఎస్. షర్మిల  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.

కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?

యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీని వై.ఎస్. షర్మిల  కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశం ఉంది.  2024 జనవరి మాసంలో  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  రాహుల్ గాంధీ  ఇతర నేతలు ఈ నెల  27న ఢిల్లీలో సమావేశమయ్యారు.
 


కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి కనీసం  10 నుండి  15 శాతం ఓట్లు దక్కాలని ఆ పార్టీ  వ్యూహ రచన చేస్తుంది.  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే  ఆ పార్టీకి రాజకీయంగా కలిసి వస్తుందనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు.

కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప పార్లమెంట్ స్థానం నుండి రానున్న ఎన్నికల్లో వై.ఎస్. షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా వై.ఎస్. షర్మిల  కడప నుండి బరిలోకి దిగే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. అయితే అదే జరిగితే వైఎస్ఆర్‌సీపీ నుండి  ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపుతుందా మరొకరిని బరిలోకి తీసుకువస్తుందా అనేది  త్వరలోనే తేలనుంది. 

కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?

వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ నుండి కడప నుండి పోటీ చేస్తే వై.ఎస్. వివేకానంద రెడ్డి  కుటుంబం ఏ వైఖరిని తీసుకుంటుందోననే చర్చ సర్వత్రా సాగుతుంది.  వై. ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయమై వై.ఎస్. షర్మిల గతంలో స్పందించారు.వై.ఎస్. వివేకానంద రెడ్డి  వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో కథనాలను ఆమె తప్పు బట్టారు.వివేకానంద రెడ్డిని హత్య చేసిందెవరో బయట పెట్టాలని ఆమె దర్యాప్తు సంస్థలను కోరారు.  

కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇటీవలనే వైఎస్ఆర్‌సీపీకి   ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేశారు.  ఆళ్ల రామకృష్ణా రెడ్డిని బుజ్జగించేందుకు  వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం  చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వై.ఎస్. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో  కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. వై.ఎస్. షర్మిల  వెంట తాను  నడవనున్నట్టుగా  ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని  సుమారు  40 నుండి 60 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చనున్నారు. త్వరలోనే అభ్యర్థుల మార్పునకు సంబంధించి వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.  వైఎస్ఆర్‌సీపీలో టిక్కెట్లు దక్కని వారంతా వై.ఎస్. షర్మిల వెంట నడిచే అవకాశం ఉంది. ఆళ్ల రామకృష్ణా రెడ్డి  వ్యాఖ్యలు  ఇందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. 

కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?


వైఎస్ఆర్‌సీపీలో  టిక్కెట్లు దక్కని అభ్యర్థులు వై.ఎస్. షర్మిల వైపు చేరితే  ఆ పరిణామం  రాజకీయంగా వైఎస్ఆర్‌సీపీకి ఏ మేరకు నష్టం కలిగిస్తుందోననేది  ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. మరో వైపు  ప్రస్తుతం జరుగుతున్నట్టుగా  వై.ఎస్. షర్మిల  కాంగ్రెస్ చేరి, వైఎస్ఆర్‌సీలో టిక్కెట్లు దక్కని అభ్యర్ధులు కాంగ్రెస్ లో చేరితే  ఆ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
 

Latest Videos

click me!