జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2024 ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సన్నద్దమౌతున్నాయి. గతానికి భిన్నంగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వ్యూహలను రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు దాదాపుగా పూర్తైంది.
also read:బీజేపీ తేల్చాకే: సీట్ల సర్ధుబాటుపై టీడీపీ, జనసేన ప్రకటన
జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే 90 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు పూర్తి చేశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ పార్టీ నేతలకు సూచించారు.
also read:టీడీపీతో పొత్తుపై సంక్రాంతికి విడుదల: మోడీకి నివేదిక
జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం, జనసేనలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లను జనసేన పార్టీ కోరే అవకాశం ఉంది. దీంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడ ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.
also read:బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం కష్టాలు: మేడిగడ్డ ముంచుతుందా, తేల్చుతుందా?
జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు
ఇదిలా ఉంటే జనసేనతో పాటు ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరితే ఆ పార్టీకి కూడ సీట్లను కేటాయించాల్సిన అనివార్య పరిస్థితులు తెలుగు దేశం పార్టీపై ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ 12 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలను కోరుతున్నట్టుగా ప్రచారం సాగుతుంది. మరో వైపు జనసేన కూడ 30కిపైగా అసెంబ్లీ స్థానాలపై పట్టుబడుతుంది. అయితే జనసేన కోరినన్ని స్థానాలను తెలుగు దేశం పార్టీ ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని తెలుగు దేశం పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.
also read: జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 90 అసెంబ్లీ స్థానాలను మినహాయించి ఇతర స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. పొత్తుల పేరుతో ఇతర పార్టీలకు ఎక్కువ సీట్లను కేటాయిస్తే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ)కి పరోక్షంగా ప్రయోజనం కలిగే అవకాశం లేకపోలేదనే చర్చ తెలుగు దేశం వర్గాల్లో సాగుతుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు సీట్లను కేటాయించాలని చంద్రబాబును ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.
also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు
జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు
2024 అసెంబ్లీ ఎన్నికలను తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతే తెలుగు దేశం పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. దీంతో ఈ ఎన్నికలను తెలుగు దేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు మాత్రమే టిక్కెట్లను తెలుగు దేశం నిర్ణయం తీసుకుంది. సర్వే రిపోర్టు ఆధారంగానే అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారు. 90 అభ్యర్థులకు ఈ సర్వే రిపోర్టు ఆధారంగా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.వైఎస్ఆర్‌పీ ఇంకా అభ్యర్థులను ఖరారుపై కేంద్రీకరించింది. కానీ, చంద్రబాబు మాత్రం 90 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు.
also read:ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు
జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు
2024 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దఫా అధికారంలోకి రావడం కోసం వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కేంద్రీకరించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని 40 నుండి 60 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలను మార్చనున్నారు. ఇప్పటికే 11 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలను మార్చారు. మిగిలిని స్థానాల్లో మార్పులకు సంబంధించిన వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం రెండు మూడు రోజుల్లో ప్రకటించనుంది.
also read:ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?