AP Inter Results: ఆ ఇంటర్‌ కాలేజీలో చదివినోళ్లంతా తప్పారు.. ఏపీలో సంచలనం... ఎవర్రా మీరంతా?

Published : Apr 12, 2025, 03:54 PM IST

AP Inter Results: ఏపీలో ఇవాళ ఉదయం విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలను తొలిసారిగా వాట్సప్‌లోనే విడుదల చేసింది. ఇక గత పదేళ్ల పాస్‌ పర్సెంటేజ్‌తో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. తొలి ఏడాది విద్యార్థులు 70 శాతం, రెండో సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత 83 శాతం మంది పాసయ్యారు. ఇదంతా బాగున్నా.. ఏపీలోని ఓ ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్‌ పరీక్ష రాయగా.. అందరూ ఫెయిల్‌ అయ్యారు. మరి వారు ఏ జిల్లా విద్యార్థులో చూద్దాం రండి..   

PREV
15
AP Inter Results: ఆ ఇంటర్‌ కాలేజీలో చదివినోళ్లంతా తప్పారు.. ఏపీలో సంచలనం... ఎవర్రా మీరంతా?
AP Inter Results

ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో ఎప్పటిలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా నంబర్‌ వన్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు ఇతర జిల్లాలు ఉన్నాయి. ఇక ఒకేషన్‌ ఇంటర్‌ లోనూ గత పదేళ్లతో పోలిస్తే రికార్డు స్థాయిలో విద్యార్థులు ఈ ఏడాది ఉత్తీర్ణత పొందారు. ఒకేషనల్‌ ప్రభుత్వ కళాశాలల్లో అత్యధికంగా 64 శాతం, రెండో ఏడాదిలో 82శాతం మంది పాసయ్యారు. 

25
AP Inter Results 2025

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. రెండో ఏడాది చదివిన అమ్మాయిల ఉత్తీర్ణత 81 శాతంగా ఉండగా.. అబ్బాయిలు .. 75 శాతం మంది పాస్‌ అయ్యారు. వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం 71 శాతంగా ఉంది. తొలి ఏడాదిలో కూడా బాలికల ఉత్తీర్ణత 71 శాతం ఉండగా.. బాలురిది 64 శాతంగా ఉంది. 

35
AP Inter Results

పరీక్షల ఫలితాలు విడుదలైన వెంటనే సప్లిమెంటరీ పరీక్ష తేదీలను అధికారులు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి 22 వరకు చెల్లించవచ్చన్నారు. మే 12 నుంచి 20 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1 వరకు జరగనున్నట్లు వివరించారు. 

45
AP Inter Results

రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ చేయించుకోవాలనుకునే వారు ఈ నెల 13 నుంచి 22వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మాత్రమే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత వాటిని తిరిగి ఇవ్వరు. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ తర్వాత మార్కులు తగ్గినా, పెరిగినా వాటిని తుది ఫలితంగా నిర్ణయిస్తారు. రీ వాల్యుయేషన్ కోరితే విద్యార్థులకు జవాబు పత్రాల స్కానింగ్ కాపీ పంపుతారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.  

 

55
AP Inter Results

ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందని ప్రభుత్వం చెబుతుండగా.. కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ కళాశాలకు చెందిన అందరు విద్యార్థులు పరీక్షల్లో తప్పారు. ఈ కళాశాలకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు 33 మంది పరీక్షలు రాయగా.. అందరూ ఫెయిల్‌ అయినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ఖాజా పర్వీన్‌ తెలిపారు. రెండో ఏడాదికి చెందిన విద్యార్థులు 14 మంది పరీక్షలు రాయగా.. కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారని ఆయన చెబుతున్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories