Heavy Rains: ఏపీని తాకిన రుతుప‌వ‌నాలు.. భారీ వ‌ర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ

Published : May 26, 2025, 08:38 PM IST

heavy rain in Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మే 30 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

PREV
16
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు

Heavy rains: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మే 30 వ‌ర‌కు భారీ వర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) హెచ్చ‌రించింది. పిడుగులు, ఉరుములు మెరుపుల‌తో పాటు ఈదురుగాలులు వీస్తూ వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు చోటుచేసుకుని భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని తెలిపింది.

26
ఈ వారంలో భారీ వ‌ర్షాలు

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి వచ్చే నాలుగైదు రోజులపాటు కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది.

36
ఆంధ్రప్రదేశ్‌కు ముందుగానే వచ్చిన రుతుప‌వ‌నాలు

సాధారణంగా జూన్ 4న ప్రవేశించే రుతుప‌వ‌నాలు ఈ ఏడాది ముందుగానే ఏపీని తాకాయి. మే 26న‌ రాయలసీమ ప్రాంతంలోకి రుతుప‌వ‌నాలు ప్రవేశించాయి. గత పదేళ్లలో రుతుప‌వ‌నాలు సాధార‌ణం కంటే ముందుగానే రాష్ట్రానికి రావ‌డం ఇది రెండోసారి. గతేడాది కూడా రుతుప‌వ‌నాలు జూన్ 2న రాష్ట్రంలోకి ప్ర‌వేశించాయి.

46
రుతుప‌వ‌నాల రాక‌తో చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు

రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో ఏపీతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఐఎండీ అమరావతి కేంద్రం డైరెక్టర్ స్టెల్లా మాట్లాడుతూ.. మే 26న మాన్సూన్ మరిన్ని ప్రాంతాల్లోకి విస్తరించినట్టు తెలిపారు. ఇందులో ముంబయి, బెంగళూరు సహా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తూర్పు-మధ్య భారతంలోని పలు రాష్ట్రాలు, తూర్పు-ఉత్తర బంగాళాఖాత ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు.

56
ఏపీలో గతేడాది సాధారణం కంటే అధిక వర్షపాతం

2024లో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 21 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా 521.6 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సిన స్థాయి కాగా, 629.2 మిల్లీమీటర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఇది ఖరీఫ్ సాగు విస్తరణకు దోహదపడింది.

66
వ‌ర్షాధారిత ఖరీఫ్ సాగుకు నైరుతి రుతుప‌వ‌నాలు కీల‌కం

ఆంధ్రప్రదేశ్ తన వార్షిక వర్షపాతంలో కనీసం 70 శాతం వర్షాన్ని జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పొందుతుంది. ఈ వర్షాలు రిజర్వాయర్లు నింపేందుకు, భూగర్భజలాలను పునరుద్ధరించేందుకు, వర్షాధారిత ఖరీఫ్ సాగుకు కీలకం. నైరుతి రుతుప‌వ‌నాలు సాగులో కీల‌క పాత్ర పోషిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories