Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎందుకు అరెస్టు అయ్యారు? కేసు ఏంటి?

Published : May 25, 2025, 11:17 PM IST

Kakani Govardhan Reddy: వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగిలింది. వైకాపా నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అయ్యారు. కేరళలో ఏపీ పోలీసులు అయనను అరెస్టు చేశారు.

PREV
16
ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు

Kakani Govardhan Reddy : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) సీనియర్ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అయ్యారు. కేరళలో నెల్లూరు పోలీసులు అయనను అరెస్ట్ చేశారు. దాదాపు రెండు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న కాకాణిని ఆదివారం కేరళలోని త్రివేండ్రం విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

26
సుప్రీంకోర్టులోనూ కాకాణి గోవర్ధన్ రెడ్డి షాక్

సుప్రీంకోర్టు ఇటీవల ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ దరఖాస్తును తిరస్కరించడంతో అరెస్టుకు మార్గం సుగమమైంది. అయితే, సుప్రీంకోర్టు లో ఆయనకు షాక్ తగలడంతో పరారీలో ఉన్నారు. రెండు నెలలుగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న కాకాణిని పక్కా సమాచారంతో నెల్లూరు పోలీసుల ప్రత్యేక బృందం కేరళకు వెళ్లి, త్రివేండ్రం విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

36
కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఉన్న కేసులేంటి?

కాకాణి గోవర్ధన్ రెడ్డి పై మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిలో రెండు అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులు ఉన్నాయి. జనవరిలో టీడీపీ నేత,సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో నెల్లూరులో కేసు నమోదు అయింది. ఆయన క్వార్ట్జ్ మైనింగ్‌ను అక్రమంగా కొనసాగించినట్లు ఆరోపించారు. మైనింగ్ ప్రాంతాల్లోని గిరిజనుల ఆస్తుల నాశనం చేయడం, బెదిరింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదుతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. 

ఈ రెండు కేసులతో పాటు అక్రమ మైనింగ్ కేసు కూడా ఉంది. గనుల లీజు పూర్తయిన తర్వాత కూడా ఇష్టానుసారంగా మైనింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గనులను పేల్చేందుకు భారీగా పేలుడు పదార్థాలను నిల్వ చేశారనే ఆరోపణలతో ఫిబ్రవరిలో 16న కేసు నమోదైంది. ఏ4గా ఉన్న కాకాణి వరుసగా నోటీసులు ఇచ్చిన విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే కేరళలో పోలీసులకు దొరికారు.

46
కాకాణి కేసు విచారణలో ఏం తేలిందంటే?

నెల్లూరు జిల్లా మైన్స్ అండ్ జియాలజీ శాఖ చేపట్టిన విచారణలో 61,313 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ అక్రమంగా తవ్వి తరలించారని తేలింది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.7.56 కోట్లకు పైగా ఆదాయ నష్టం జరిగింది. కాకాణి పేరిట నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు కూడా గుర్తించారు. విచారణ కోసం రావాలని చాలా సార్లు చెప్పినా రాకపోవడంతో పోలీసులు అనేకసార్లు ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు. బెంగళూరు, హైదరాబాద్‌, ఏపీలో గాలించినా దొరకలేదు. రెండు నెలల పరారీ తర్వాత ఇపుడు పోలీసులకు చిక్కారు.

56
లుక్‌ఔట్ నోటీసుల తర్వాత పోలీసులకు దొరికిన కాకాణి

సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం, పోలీసులు కాకాణిపై లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు పంపించారు. ఆయనను ఆదివారం తిరువనంతపురం విమానాశ్రయంలో అరెస్ట్ చేయడంతో కేసులో కీలక మలుపు ఏర్పడింది. అయన్ను ప్రస్తుతం నెల్లూరుకు తీసుకువస్తున్నారు.

66
కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై వైఎస్ఆర్‌సీపీ ఏం చెప్పిందంటే?

కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్‌తో వైఎస్ఆర్‌సీపీలో కలకలం రేగింది. పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. ఇదంతా రాజకీయ ప్రతీకారంతోనే జరుగుతోందని కూటమి సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది. 

కాగా, ఈ అరెస్ట్, అధికార దుర్వినియోగం, అక్రమ మైనింగ్ ఆరోపణలపై ప్రభుత్వ విచారణకు మోమెంటం అందించనుంది. కాకాణి అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.

Read more Photos on
click me!

Recommended Stories