పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం, జనసేన కూటమిపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ) ఫోకస్ పెట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంలో కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని బరిలోకి దింపాలని వైఎస్ఆర్‌సీపీ భావిస్తుంది.
పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి. దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలపై వైఎస్ఆర్‌సీపీ కేంద్రీకరించింది.
పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారనే ప్రచారం సాగుతుంది. వైఎస్ఆర్‌సీపీ కీలక నేతలు ఇటీవల కాలంలో ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపినట్టుగా ప్రచారం సాగుతుంది. వైఎస్ఆర్‌సీపీలో చేరాలని ముద్రగడ పద్మనాభాన్ని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆహ్వానించినట్టుగా స
మాచారం. 2024 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ముద్రగడ పద్మనాభం ఇంటికి ఇవాళ భారీగా ఆయన అభిమానులు, కాపు సామాజిక వర్గం నేతలు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..
ఉభయ గోదావరి జిల్లాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఈ రెండు జిల్లాల్లో జనసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు గణనీయంగా ఉంటారు . దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ లేదా పిఠాపురం అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతుంది.
పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..
పవన్ కళ్యాణ్ బరిలోకి దిగే స్థానం నుండి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారని చర్చ సాగుతుంది. మరో వైపు ముద్రగడ పద్మనాభం తనయుడు చల్లారావు, ముద్రగడ పద్మనాభం కోడలు కూడ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం కూడ ఉందనే ప్రచారం కూడ సాగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభాన్ని బరిలోకి దింపడం ద్వారా పవన్ కళ్యాణ్ కు గట్టిపోటీ ఇచ్చినట్టు అవుతుందని వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం భావిస్తుంది.
పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..
2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో గాజువాక, భీమవరం నుండి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు.ఈ రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు.ఈ దఫా కాకినాడ లేదా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మరో వైపు ఉత్తరాంధ్రలోని గాజువాక నుండి కూడ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.