IMD Rain Alert : దక్షిణాది రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి… కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏమిటి?
IMD Weather Updates : వర్షాకాలం ఎప్పుడో ముగిసింది... శీతాకాలం మొదలై చాలారోజులు అవుతోంది. అయినా చాలా ప్రాంతాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు. ఇంకా చెప్పాలంటే వర్షాకాలం ముగిశాకే వరుస తుపానులు ఏర్పడుతూ వర్ష బీభత్సం కొనసాగుతోంది... డిసెంబర్ ఆరంభంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వానలు పడ్డాయి. ఇప్పుడు కూడా పలు ప్రాంతాల్లో చల్లని గాలులతో కూడిన చిరుజల్లులు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
27
ఈ మూడ్రోజులు వానలే...
ప్రస్తుతం తమిళనాడులో చలి చంపేస్తోంది... దీనికి వర్షాలు తోడయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. డిసెంబర్ 20 (శనివారం) నుండి 22 (సోమవారం) వరకు ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావం తమిళనాడు బార్డర్ ఏపీ జిల్లాలపై ఉంటుందని... అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు ఛాన్సెస్ ఉన్నాయని అంచనా వేస్తోంది. వర్షాన్ని తలపించేలా తెల్లవారుజామున పొగమంచు కురిసే అవకాశాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
37
యూఏఈ లో కుండపోత వానలు
ఇదిలా ఉంటే ఎడాది దేశం యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అబుదాబీ, దుబాయ్ సహా అనేక నగరాల్లో వరదలు సంభవిస్తాయంటే ఏ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. రోడ్లన్ని జలమయమై పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి... సాధ్యమైతే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించాలని వ్యాపార సంస్థలకు సూచించారు. ప్రజలు రోడ్లపైకి రావద్దని... ఇళ్లలోనే సేఫ్ గా ఉండాలని సూచిస్తున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి విషయానికి వస్తే గడ్డకట్టే స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ, కొండ ప్రాంతాల్లో చలి ఇరగదీస్తోంది... అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో 3.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి.మాడుగులలో 4.1, హకుంపేటలో 6.2, పాడేరులో 7.1, చింతపల్లిలో 7.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలున్నాయి... ఇలా అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఈ చలిగాలుల తీవ్రత ఇప్పట్లో తగ్గబోదని... మరికొన్నిరోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.
57
తెలంగాణపై చలి పంజా
తెలంగాణలో పరిస్థితి కూడా దారుణంగా ఉంది... ఉష్ణోగ్రతలు కుప్పకూలిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ చలి చంపేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ రెండ్రోజులు చలి ఫీక్స్ కు చేరుకుంటుందని...ఊహించని స్థాయిలో చలి ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
67
అత్యల్ప ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 5.7 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లాలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 6.5, ఆదిలాబాద్ లో 7.7, వికారాబాద్ లో 8.1, సిద్దిపేటలో 8.1, మెదక్ లో 8.5, కామారెడ్డిలో 8.6, నిర్మల్ లో 8.9, నిజామాబాద్ లో 9.1, నాగర్ కర్నూల్ లో 9.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు.
77
హైదరాబాద్ వాతావరణ పరిస్థితి ఇలా..
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ లో 6.5°C, ఇబ్రహీంపట్నంలో 7.5°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నగరంలోని శేరిలింగంపల్లి (HCU) లో 8.1, మౌలాలిలో 9.4, రాజేంద్రనగర్ లో 9.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇంకా నగరంలోని అనేక ప్రాంతాల్లో 10 నుండి 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాంక్రీట్ జంగిల్ హైదరాబాద్ లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఆశ్చర్చకరం.