Roja vs Kirrak RP: జబర్దస్త్ కమెడియన్ గా పరిచయమైన కిరాక్ ఆర్పీ, అదే జబర్దస్త్ కు జడ్జిగా పనిచేసిన రోజా మధ్య వివాదం ఎప్పటినుంచో సోషల్ మీడియాలో సాగుతూనే ఉంది. అవకాశం దక్కినప్పుడల్లా ఇద్దరూ తీవ్ర వ్యాఖ్యలతో ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉంటున్నారు.
రోజా, కిరాక్ ఆర్పీ.. ఇద్దరు జబర్దస్త్ వేదికపై ఎన్నో ఏళ్ల పాటు కలిసి కనిపించారు. కానీ రాజకీయపరంగా ఇద్దరూ చెరో పార్టీలో ఉండడంతో అవకాశం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో కూడా రోజా జబర్దస్త్ లో చేసిన వారికి చేసిన వారిలో ఒక్కడికి తప్పా.. అందరికీ కృతజ్ఞత ఉందని పరోక్షంగా కిరాక్ ఆర్పీ గురించి కామెంట్లు చేసింది. తిరుపతి దర్శనానికి టికెట్లు కావాలంటే అందరికీ తీసిచ్చాను, ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు.. అలా దర్శనం చేసుకున్న వాడే ఈరోజు ఎక్కువగా మాట్లాడుతున్నాడు.. జబర్దస్త్ లో చేసిన వారందరూ తిరుపతి వచ్చినప్పుడు మా ఇంటికి కూడా వచ్చిన వారే. అందులో ఒకడికి తప్పకుండా దేవుడు పనిష్మెంట్ వస్తుంది అని కామెంట్ చేసింది రోజా.
23
రోజా అతి విమర్శలు
రోజా చేసిన కామెంట్లు కిరాక్ ఆర్పీని ఉద్దేశించే అని నెటిజన్లకు అర్థం అయిపోయింది. ఎందుకంటే ఏపీ ఎన్నికల సమయంలో రోజా, కిరాక్ ఆర్పీ మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. కిరాక్ ఆర్పీ జనసేన-టీడీపీ కూటమి మద్దతుదారుడు. రోజా.. కూటమికి చెందిన వారిపై తీవ్ర విమర్శలు చేస్తే వెంటనే యూట్యూబ్ లో రియాక్ట్ అవుతాడు కిరాక్ ఆర్పీ. ఓ రేంజ్ లో రోజాకు ఇచ్చి పడేస్తాడు. కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ ను వదిలేసాక నెల్లూరు చేపల పులుసు అనే పేరుతో ఫుడ్ స్టాల్ ను ఓపెన్ చేసి విపరీతంగా సంపాదిస్తున్నాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. ఆ సమయంలో రోజాను ఓ రేంజ్ లో ఏకి పారేశాడు. ఇప్పుడు మళ్లీ అదే పని చేశాడు కిరాక్ ఆర్పి.
వారం రోజుల క్రితం చిత్తూరులోని నిండ్ర, విజయపురం అనే మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల గురించి రోజా మాట్లాడుతూ.. విజయపురం మండలంలో ఎనిమిది ఎంపీటీసీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని, నిండ్ర మండలంలో ఏడు ఎంపీటీసీలు వైసిపివేనని అంది. వీరందరూ ఫ్యాన్ గుర్తు పై గెలిచి టిడిపిలోకి వెళ్లిపోయారని కామెంట్లు చేసింది. వారిని ఆడంగి వెధవలని తిట్టింది. ఒకరు తాళి కడితే వేరొకరు ఏదో చేసే దాన్ని ఏమంటారు మీరే చెప్పాలి అంటూ దిగజారి మాట్లాడింది రోజా. దీంతో కిరాక్ ఆర్పి ఆమెపై తీవ్ర విమర్శలతో ప్రతిదాడి చేశాడు.
33
నీ ఇంట్లో ఆడోళ్లు ఉన్నారు కదా
కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ గతంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తుండగా అధికారంలో ఉన్నప్పుడే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ను లకారపు తిట్లతో తిట్టిన రోజాకు సంస్కారం ఉందా? అని ప్రశ్నించాడు. సభ్య సమాజంలో విచ్చలవిడిగా చెడు మాటలు మాట్లాడే రోజా.. ఏదో మంచి దానిలా మాట్లాడుతోందని విమర్శించాడు. ‘నువ్వు ఒక మహిళవై ఉండి, నీకు ఒక కూతురు ఉండి, నీకు ఒక అమ్మనుండి, ఒక అత్త ఉండి.. ఇలా దిగజారి మాట్లాడతావా’ అని ఆర్పీ గట్టిగానే రిప్లై ఇచ్చాడు. ‘నీకు నిజంగా దమ్మూ, ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడిన ఈ మాటలను నీ పిల్లల ఇద్దరి ముందు మాట్లాడి చూడు అన్నాడు. సాటి మహిళలు కూడా తలదించుకునేలాగా మాట్లాడేది నువ్వేనని రోజాకు కౌంటర్ ఇచ్చాడు ఆర్పీ.
రోజా కొడుకు చెప్పినా..
ఎన్ని ప్రలోభాలు చూపెట్టినా, లొంగకుండా జగనన్న వెనుక నిలుచున్న వాళ్లే ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాళ్లు అని రోజా అంది. దానిపై కూడా ఆర్పీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఏ ప్రలోభాలు పెట్టారో, ఎలాంటి చిత్రహింసలు పెట్టారో, ఎలాంటి బాధలు పెట్టారో సాక్ష్యాలు చూపించమని ఆర్పీ ప్రశ్నించాడు. వైసిపీ కార్యకర్తలను ఎవరూ ఏమీ చిత్రహింసలు పెట్టడం లేదని వివరించాడు. రాజకీయాల్లో చెడు మాటలు మాట్లాడకూడదని రోజా కొడుకే చెప్పాడు.. కానీ ఆమె ఇప్పుడు ఆడంగి వెధవలు అంటూ కామెంట్లు చేస్తోందని అన్నాడు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఎప్పటినుంచో సాగుతూనే ఉంది. ఒకరికొకరు ఇలా కౌంటర్లు ఇచ్చుకుంటూనే వెళుతున్నారు.