Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్

Published : Jan 14, 2026, 07:57 AM IST

Weather Update in Sankranti : గత వారం రోజులుగా వాతావారణం కాస్త టెన్షన్ పెట్టింది. కానీ సరిగ్గా సంక్రాంతి పండగ సమయంలో అంతా సెట్ అయ్యింది. ఈ మూడ్రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే.. 

PREV
16
సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం...

IMD Rain Alert, IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా చలి ఇరగదీస్తోంది. ఇది చాలదన్నట్లు సరిగ్గా సంక్రాంతి పండక్కి ముందు బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ఏర్పడి వర్షాలు మొదలయ్యాయి. దీంతో సంక్రాంతి వేడుకలకు ఎక్కడ ఈ వాతావరణ పరిస్థితులు ఆటంకం కలిగిస్తాయోనని తెలుగు ప్రజలు కంగారుపడిపోయారు. వారికి వాతావరణ నిపుణులు గుడ్ న్యూస్ చెబుతున్నారు.

26
సంక్రాంతికి ఆహ్లాదకర వాతావరణం

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ సంక్రాంతి పండగ మూడ్రోజులు చలి తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ, నిపుణులు చెబుతున్నారు అలాగే వర్ష సూచనలు కూడా లేవని తెలిపారు. కాబట్టి ప్రశాంత వాతావరణం తెలుగు ప్రజలు పండగ సంబరాల్లో మునిగితేలవచ్చు. 

36
ఏపీలో వర్షాలు లేవు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు మారాయి... కొన్నిచోట్ల వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా తమిళనాడు బార్డర్ జిల్లాలు తిరుపతి, చిత్తూరులో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడ్డాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలు లేవని... చలి కూడా తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

46
తెలంగాణలో మారిన టెంపరేచర్స్

తెలంగాణ విషయానికి వస్తే దాదాపు రెండునెలల తర్వాత ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపిస్తోంది... ప్రస్తుతం చలి బాగా తగ్గింది. గతంలో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదైన జిల్లాల్లోనూ ప్రస్తుతం 15 డిగ్రీలకు పైగానే కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి... గరిష్ఠంగా 30 డిగ్రీలు ఉంటున్నాయి. అంటే సాధారణ శీతాకాలం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నమాట. ఇకపై కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందని... చలితీవ్రత సాధారణ స్థాయిలోనే ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. అయితే ఇవాళ(జనవరి 14) అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.

56
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే..

ఇన్నిరోజులు అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాల్లోనూ చలి తగ్గింది. మంగళవారం (13 జనవరి 2026) అత్యల్పంగా మెదక్ లో 13.8 డిగ్రీలు నమోదయ్యింది. ఇక నల్గొండలొ 15, రామగుండంలో 15.3, ఆదిలాబాద్ 17, నిజామాబాద్ లో 17.7, హన్మకొండలొ 17, ఖమ్మంలో 19.4, భద్రాచలంలో 20, మహబూబ్ నగర్ లో 20.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో 30.4 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి.

66
హైదరాబాద్ వాతావరణం

హైదరాబాద్ విషయానికి వస్తే అత్యల్పంగా రాజేంద్ర నగర్, హయత్ నగర్ లలో 18 డిగ్రీలు, పటాన్ చెరులో 18.2, హకీంపేటలో 20.2, బేగంపేటలో 20.6, దుండిగల్ లో 201 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా హకీంపేటలో 27.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories