IMD Cold Wave Alert : ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు… తెలంగాణలో చలిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి ఇవాళ (డిసెంబర్ 4, గురువారం) తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా?
IMD Rain Alert : వర్షాకాలం ఎప్పుడో ముగిసింది... కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వానలు పడుతూనే ఉన్నాయి. శీతాకాలం వచ్చినా వర్షాలు వదిలిపెట్టడంలేదు... ఓవైపు ఉష్ణోగ్రతలు పడిపోయి చల్లని గాలులు... మరోవైపు జోరువానలతో తెలుగు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పట్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం లేదని... చలిగాలులు, వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలను బట్టి అర్థమవుతోంది.
25
బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను బలహీనపడి ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది.. ఇది నేడు (డిసెంబర్ 4, గురువారం) మరింత బలహీనపడుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. అయినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కొనసాగుతాయని... కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. చలి గాలులు, వానలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి... కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. రైతులు కూడా పంటనష్టం జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచిస్తోంది.
35
ఏపీలో భారీ వర్షాలు
ప్రస్తుతం తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఈరోజు (డిసెంబర్ 4న) కూడా కొనసాగే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక కాకినాడ, ఉభయ గోదావరి, చిత్తూరు, కడప, ప్రకాశం, అన్నమయ్య, అనంతపూర్ జిల్లాల్లోనూ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. రాయలసీమలో తేలికపాటి వర్షాలు... కోస్తాంధ్ర లో ముసురు వాతావరణం... ఉత్తరాంధ్రలో చలి వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగం వెల్లడించింది.
తెలంగాణ విషయానికి వస్తే నేడు (డిసెంబర్ 4, గురువారం) కొన్ని జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ సాధారణం నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
55
తెలంగాణలో మళ్లీ చలి పంజా
తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. ఇకపై రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుందని... డిసెంబర్ 9 తర్వాత తారాస్థాయికి చేరే అవకాశాలున్నాయిని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.