
January 2026 Holidays : 2025 డిసెంబర్ చివరికి చేరుకున్నాం... ఇంకొన్ని రోజులు గడిస్తే కొత్త సంవత్సరం 2026 లోకి అడుగుపెడతాం. ఈ సంవత్సరం పండగలు, ప్రత్యేక పర్వదినాలు, జాతీయ దినోత్సవాలు, స్థానిక వేడుకలే కాదు బంద్ లు, వర్షాల కారణంగా కూడా సెలవులు వచ్చాయి. దీంతో 2026 లో సెలవులు ఎలా ఉన్నాయోనని చాలామంది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏడాదంతా ఎలా ఉన్నా ఆరంభంలో మాత్రం అత్యధిక సెలవులు ఉన్నాయి. జనవరి 2026 లో దాదాపు సగం రోజులు సెలవులకే పోతున్నాయి... కేవలం సగంరోజులే వర్కింగ్ డేస్.
ఇలా 2025 ముగిసి అలా 2026 లో అడుగు పెడతామో లేదో సెలవులు ప్రారంభం అవుతాయి. నూతర సంవత్సర వేడుకల నేపథ్యంలో 1 జనవరి 2026 ఆప్షనల్ హాలిడే ఇచ్చాయి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు. అంటే ఈరోజు ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. డిసెంబర్ 31న వేడుకలు జరుపుకున్నవారు ఈ సెలవును వాడుకోవచ్చు... కొన్ని విద్యాసంస్థలు కూడా న్యూఇయర్ సెలవు ఇస్తాయి.
జనవరి 3న మరో ఆప్షనల్ హాలిడే ఉంది. ముస్లింల ఆరాధ్య దైవం హజ్రత్ అలీ భర్త్ డే సందర్భంగా ఈరోజు (శనివారం) సెలవు ఇచ్చారు. ఈ ఆప్షనల్ హాలిడేను ముస్లిం ఉద్యోగులు ఎక్కువగా తీసుకునే అవకాశాలున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ లాంటి ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యాసంస్థలకు కూడా ఈరోజు సెలవు ఉండే అవకాశాలున్నాయి.
జనవరి 4 ఎలాగూ ఆదివారమే... కాబట్టి ఈరోజు సాధారణ సెలవు ఉంటుంది. ఇలా జనవరి ఫస్ట్ వీకెండ్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకలను గట్టిగా జరుపుకుని అలసిపోయినవారు ఈ సెలవుల్లో విశ్రాంతి తీసుకోవచ్చు.
ప్రతి నెలలో రెండో శనివారం ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది. ఇలా జనవరి 10న రెండో శనివారం వస్తోంది... కాబట్టి సెలవు ప్రకటించారు. ఇక తర్వాతిరోజు (జనవరి 11) ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు ఉంది. జనవరి సెకండ్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి.
జనవరిలో వచ్చే సంక్రాంతి పండగ తెలుగు ప్రజలకు చాలా ప్రత్యేకమైనది. ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం దేశవిదేశాల్లో ఎక్కడెక్కడో స్థిరపడిన తెలుగువారు సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెలుతుంటారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పండగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే జనవరి 14,15,16 మూడ్రోజులు ఉద్యోగులకు సెలవు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణ సర్కార్ మాత్రం జనవరి 14, 15 సాధారణ సెలవు, జనవరి 16 ఆప్షనల్ హాలిడే ఇచ్చింది.
ఉద్యోగులకు రెండుమూడు రోజులే సెలవులు... కానీ విద్యార్థులకు సంక్రాంతికి భారీగా సెలవులు వస్తున్నాయి. జనవరి 10 నుండే సెలవులు ప్రారంభమై జనవరి 20 వరకు కొనసాగనున్నాయి. తెలంగాణలో కంటే ఏపీలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఎక్కువగా వస్తాయి.
సంక్రాంతి సెలవులకు మరో రెండ్రోజుల సెలవులు కలిసిరానున్నాయి. జనవరి 17న (శనివారం) షబ్-ఈ మేరాజ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉంది. తర్వాత జనవరి 18 ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు. ఇలా సెలవులు కలిసివచ్చి సంక్రాంతి హాలిడేస్ మూడు కాదు ఐదు రోజులకు పెరిగాయి.
జనవరి 23న (శుక్రవారం) శ్రీపంచమి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉంది. ఇక జాతీయ పర్వదినం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 (సోమవారం) సెలవు వస్తోంది. దీనికి ముందురోజు జనవరి 25 ఆదివారం సెలవే. ఇలా జనవరి చివరి వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారింది.
1. న్యూ ఇయర్ - 01 జనవరి 2026 (గురువారం) - ఆప్షనల్ హాలిడ్
2. హజ్రత్ అలీ భర్త్ డే - 03 జనవరి 2026 (శనివారం) ఆప్షనల్ హాలిడే
3. ఆదివారం - 04 జనవరి 2026 - సాధారణ సెలవు
4. రెండో శనివారం - 10 జనవరి 2026 - సాధారణ సెలవు
5. ఆదివారం - 11 జనవరి 2026 - సాధారణ సెలవు
6. భోగి - 14 జనవరి 2026 (బుధవారం) - సాధారణ సెలవు
7. సంక్రాంతి - 15 జనవరి 2026 (గురువారం) - సాధారణ సెలవు
8. కనుమ - 16 జనవరి 2026 (శుక్రవారం) - ఏపీలో సాధారణ సెలవు, తెలంగాణలో ఆప్షనల్ హాలిడే
9. షబ్-ఈ మేరాజ్ - 17 జనవరి 2026 (శనివారం) - ఆప్షనల్ హాలిడే
10. ఆదివారం - 18 జనవరి 2026 - సాధారణ సెలవు
11. శ్రీ పంచమి - 23 జనవరి 2026 (శుక్రవారం) - ఆప్షనల్ హాలిడే
12. ఆదివారం - 25 జనవరి 2026 - సాధారణ సెలవు
13. రిపబ్లిక్ డే - 26 జనవరి 2026 (సోమవారం) - జాతీయ సెలవు