IMD Weather Alert : బంగాళాఖాతంలో ఇప్పటికే ఓ అల్పపీడనం కొనసాగుతోంది… దీనికి మరో అల్పపీడనం కూడా తోడయ్యే అవకాశాలున్నాయట. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరింత జోరందుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. బంగాళాఖాతంలో వర్షాలకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని... ఇది వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి... ఇవి మరింత జోరందుకునే అవకాశాలున్నాయట. ఇలా ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతుండగా మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
25
మరో అల్పపీడనం రెడీ
ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం (నవంబర్ 25న) అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో ఈ అల్పపీడనం ఏర్పడబోతోందని APSDMA ప్రకటించింది. ఇది ముందుకు కదులుతూ మరింత బలపడే అవకాశాలున్నాయని.... దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
35
బంగాళాఖాతంలో వాయుగుండం
ఇదిలావుంటే ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఇవాళ (సోమవారం, నవంబర్ 24న) వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని APSDMA తెలిపింది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఇది తుపానుగా బలపడే అవకాశాలున్నాయట... దీనికి సెన్యార్ గా నామకరణం చేయనున్నారు. దీని ప్రభావంతో ఈనెల 28 నుంచి డిసెంబర్ 01 వరకు ఏపీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది.
ఇవాళ (సోమవారం) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని APSDMA తెలిపింది. ప్రస్తుతం వరికోతల సమయం... ఈ సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
55
ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూడా ప్రస్తుతం చలి తగ్గి వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (నవంబర్ 24, సోమవారం) జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.