Weather: ఆంధ్రలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరికలు

Published : Apr 20, 2025, 06:50 AM ISTUpdated : Apr 20, 2025, 06:58 AM IST

Andhra Pradesh Rains: ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశమున్నట్లు తెలిపింది. అలాగే, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్న హెచ్చరికలు జారీ చేసింది.  

PREV
14
Weather: ఆంధ్రలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరికలు
Rain Alert in Andhra Pradesh: Light to Moderate Showers

Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ఎండలు దంచికొడుతుండగా, మరోవైపు వానలు పడుతున్నాయి. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి గల్ఫ్ అఫ్ మన్నార్ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కాణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ద్రోణి ప్రస్తుతం ఈశాన్య విదర్భ నుంచి గల్ఫ్ అఫ్ మన్నార్ వరకు కొనసాగుతోంది. అలాగే,  తెలంగాణ, కర్నాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కూడా కొనసాగుతుంది.

24
Weather Update: Thunderstorms, Lightning Likely in AP Amid Changing Climate

దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింద. గత రెండు రోజులుగా వానలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.

34
Unstable Weather in Andhra Pradesh: Heat During Day, Rain in Evenings

వర్ష ప్రభావంతో పాటు ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. అయితే, వేసవిలో అడపాదడపా వర్షాలు ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. అలాగే, అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

ఐఎండి అంచనాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, శ్రీ సత్యసాయి, ఏలూరు, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

44
IMD Issues Rain Warning for Andhra Pradesh Districts – Public & Farmers Alerted

ఐఎండీ సూచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ఒక హెచ్చరిక జారీ చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ‌, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారి చేసింది.  తీరప్రాంతాలు అధిక సముద్ర అల్లకల్లోలాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు చేపలు పట్టడం కోసం సముద్రంలోకి వెళ్లవద్దని పేర్కొంది. 

Read more Photos on
click me!

Recommended Stories