చెప్పులు పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పేడపాడు గ్రామ ప్రజలకు చెప్పులు పంపించి తన మంచి గుణాన్ని చాటుకున్నారు. ఇటీవల ఆయన అరకు, దుంబిర్గిగూడ ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటన చేశారు. ఈ సందర్భంగా పేడపాడు గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.
గ్రామానికి వెళ్ళినప్పుడు, బంగి మిట్టూ అనే వృద్ధ మహిళతో సహా చాలా మంది మహిళలు చెప్పులు లేకుండా ఉండటం ఆయన గమనించారు. దీంతో చలించిపోయిన పవన్ గ్రామంలో ఎంతమంది నివసిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. దాదాపు 350 మంది ఉన్నారని తెలియగానే, వెంటనే తన కార్యాలయ సిబ్బంది ద్వారా అందరికీ చెప్పులు అందేలా ఏర్పాటు చేశారు.