TTD: టీటీడీలో భారీగా హిందూయేతర ఉద్యోగుల తొలగింపు.. 200 మందికి పైగానా? వారికి న్యాయం చేస్తామంటున్న ఛైర్మన్‌!

Published : Apr 19, 2025, 08:17 PM IST

TTD: తిరుపతిలోని తిరుమలలో కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. రోజుకి కొన్ని లక్షల మంది స్వామి వారిని దర్శించుకుని వెళ్తుంటారు. అయితే.. ఇటీవల తిరుమలో జరుగుతున్న పలు సంఘటనలు కలకలం రేపుతున్నాయి. అన్యమత ప్రచారం తిరుమలో జరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టీటీడీలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను తొలగించాలని బోర్డు ఛైర్మన్‌ బీఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. వీరందరికీ మరోరకంగా న్యాయం చేస్తామని హామీ కూడా ఇస్తున్నారు. 

PREV
15
TTD:   టీటీడీలో భారీగా హిందూయేతర ఉద్యోగుల తొలగింపు.. 200 మందికి పైగానా? వారికి న్యాయం చేస్తామంటున్న ఛైర్మన్‌!
tirumala tirupati

తిరుమలలో ప్రస్తుతం కీలక ఉద్యోగాల్లో పనిచేస్తున్న అన్యమతస్తుల ఉద్యోగులను తొలగించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవ్వాగా.. తొలివిడతలో 40 మందిని టీటీడీ అధికారులు గుర్తించారు. తాజాగా ఈ సంఖ్య 200కు చేరిందని త్వరలో మరికొంత మంది గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు. 

25
tirumala tirupati

హిందూయేతర ఉద్యోగులందరినీ గుర్తించి.. కొందరికి వాలంటరీ రిటైర్‌ మెంట్‌ (వీఆర్‌ఎస్‌) ఇచ్చి పంపనున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రకటించారు. మరి కొంత మందిని ప్రాధాన్యం లేని పోస్టుల్లో ఉంచనున్నట్లు తెలిపారు. తొలగించిన ఉద్యోగులందరికీ ఏదోవిధంగా న్యాయం చేస్తామని బిఆర్ నాయుడు తెలిపారు. ఉద్యోగులను రాత్రికి రాత్రే విధుల నుంచి తొలగించి ఇంటికి పంపే పని తాము చేయమని అది హిందూ మత ధర్మానికి విరుద్దమని ఆయన తెలిపారు.

35
tirumala tirupati

ఇప్పటి వరకు 200 మందికి పైగా ఉద్యోగులను గుర్తించామని, వారిని తిరుపతి యాత్రికులతో సంబంధం లేని విధులకు పంపిస్తామని బీఆర్‌ నాయుడు తెలిపారు. కొందరికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) అవకాశం కల్పిస్తామన్నారు. హిందూధర్మం పాటిస్తున్నాం కాబట్టే.. ఎవరినీ ఉన్నపళంగా విధుల్లో నుంచి తొలగించడం లేదని అన్నారు. 

45
Tirumala

హిందూయేతర ఉద్యోగుల గుర్తింపులో భాగంగా మొదటి దశలో 48 మంది గుర్తించామని చైర్మన్ తెలిపారు. వారిలో ప్రతి ఒక్కరితో మాట్లాడి.. వారు ఎక్కడ పనిచేయగలరో గుర్తించి అక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. కొందరికి ఇష్టమైతే VRSను ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు... కొందరు హిందూ పేర్లను పెట్టుకుని ఉండటంతో హిందూయేతర ఉద్యోగులను గుర్తించడం కష్టమవుతోందని అంటున్నారు. 

 

55
Tirumala

కొందరు హిందువుల పేర్లను పెట్టుకుని విధుల్లో ఉంటున్నారని, అలాంటి వారిని గుర్తించడం కూడా సాధ్యం కావడం లేదన్నారు. ఉదాహరణకు ఓ వ్యక్తి వెంకటేశ్వరరావు అని పేరు పెట్టుకుని ఇంటి దగ్గర చర్చిని నడుపుతుండవచ్చని, లేదా చర్చికి వెళ్లే వ్యక్తి కావచ్చని అన్నారు. అలాంటి వారిని మనం గుర్తించగలమా? దాదాపు 40 నుంచి 50 మంది అలాంటి ఉద్యోగులను గుర్తించామన్నారు. ఇకపై కూడా హిందూయేతర ఉద్యోగులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories