Weather Alert: మండుటెండలో కూల్ న్యూస్.. వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు

Published : Mar 24, 2026, 03:29 PM IST

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ ఎండలు పెరుగుతుండగా, మరో వైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. 

PREV
15
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావం

అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు మన్నార్ గల్ఫ్ ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి ప్రస్తుతం సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.

ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

25
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలతో పాటు యానాం ప్రాంతంలో బుధ, గురువారాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే పరిస్థితి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో ఈదురుగాలులు గంటకు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉండొచ్చని హెచ్చరిక జారీ చేశారు.

35
దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పరిస్థితి

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కూడా సమానమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి. వచ్చే రెండు రోజులలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో ఈదురుగాలులు కూడా వేగంగా వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

45
రాయలసీమలో కూడా జల్లుల అవకాశం

రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధ, గురువారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉండవచ్చు. కొన్ని చోట్ల గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

55
తెలంగాణలో కూడా వర్ష సూచన

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 2 రోజులలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం, గురువారం రోజులలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి ఉండవచ్చని అధికారులు తెలిపారు. అయితే మిగతా ప్రాంతాల్లో సాధారణంగా పొడి వాతావరణం కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ అంచనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో మాత్రం వచ్చే రెండు రోజుల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత నాలుగు రోజులలో మళ్లీ 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories