వైజాగ్ లో మెట్రో పరుగులు.. ఎక్కడెక్కడ ఎప్పుడు వస్తుందంటే?

Published : Apr 28, 2025, 09:09 AM ISTUpdated : Apr 28, 2025, 09:11 AM IST

Visakhapatnam Metro Project: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశలో 46.23 కిలోమీటర్ల పొడవుతో 42 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. వైజాగ్ మెట్రో మూడు ప్రధాన కారిడార్లుగా విభ‌జించారు. రెండో దశలో నాల్గవ కారిడార్ నిర్మిస్తారు. ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతుంది.  

PREV
15
వైజాగ్ లో మెట్రో పరుగులు.. ఎక్కడెక్కడ ఎప్పుడు వస్తుందంటే?
Vizag Metro: Where and when will it arrive?

Vizag (Visakhapatnam) Metro Project: సాగరతీర నగరం వైజాగ్‌లో మెట్రో చాలా మంది కల. ఎప్పుడొకప్పుడు వస్తుందని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కల నిజం కానుంది. మొత్తం 11,498 కోట్లకు పైగా అంచనా వ్యయంతో విశాఖపట్నం మెట్రో పనులు వేగం పుంచుకున్నాయి. 3వ దశలో  3వ దశ కారిడార్లు 46.23 కిలో మీట‌ర్ల దూరం, 42 స్టేషన్లు ఉండ‌నున్నాయి. జనరల్ కన్సల్టెంట్ టెండర్ల నియామకం ₹224 కోట్లతో ఆహ్వానించారు. బిడ్‌లు 09.06.2025న తెరుచుకుంటాయి. 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి సమీక్షలో, విశాఖపట్నం మెట్రో రైలు నిర్మాణాన్ని నాలుగేళ్లలో (2028) మొత్తం పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, తొలి దశలో త్వరలోనే మెట్రో సేవలు అందుబాటులోకి రావచ్చు. విజయవాడలో నిర్వహించిన సమీక్షలో నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి డబుల్ డెక్కర్ మోడల్ మెట్రో నిర్మాణం చేపట్టాలని సూచించారు.

25
Visakhapatnam Metro Rail Eco-Friendly Metro

మూడు కారిడార్లతో మొదటి దశ, నాల్గవ కారిడార్ రెండో దశలో..

మొదటి దశ: మొత్తం 46.23 కిలోమీటర్లు, 42 మెట్రో స్టేషన్లు, మూడు కారిడార్లు.  
రెండో దశ: కొమ్మడి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు 8 కిలోమీటర్ల నాల్గవ కారిడార్.  
మొత్తం ఖర్చు: రూ. 11,498 కోట్లకు పైగా అంచనా, కేంద్రం నుంచి 100% గ్రాంట్ కోసం ఆశిస్తున్నారు.  
ఈ క్ర‌మంలోనే మొద‌టి ద‌శ‌కోసం జనరల్ కన్సల్టెంట్ టెండర్ల నియామకం ₹224 కోట్లతో ఆహ్వానించారు. బిడ్‌లు 09.06.2025న తెరుచుకుంటాయి. 

35
Vizag Metro Route Map

కారిడార్ వారీగా వైజాగ్ మెట్రో మార్గాలు

కారిడార్ I: స్టీల్ ప్లాంట్ – కొమ్మడి జంక్షన్ (34.4 కిలో మీటర్లు)
ప్రధాన స్టేషన్లు: గాజువాక, NAD జంక్షన్, ఎయిర్‌పోర్ట్, MVP కాలనీ, యేందాడ, మధురవాడ

కారిడార్ II: గురుద్వారా – పాత పోస్టాఫీస్ (5.07 కిలో మీటర్లు)
 ప్రధాన స్టేషన్లు: డ్వారకానగర్, RTC కాంప్లెక్స్, దబా గార్డెన్స్, పూర్ణ మార్కెట్

కారిడార్ III: తాటిచెట్లపాలెం – చినవాల్తేరు (6.75 కిలో మీటర్లు)
ప్రధాన స్టేషన్లు: RTC కాంప్లెక్స్, సిరిపురం, ఆంధ్రా యూనివర్సిటీ, ఆర్కే బీచ్

కారిడార్ IV (రెండో దశ): కొమ్మడి – భోగాపురం ఎయిర్‌పోర్ట్ (8 కిలో మీటర్లు)
ప్రధాన స్టేషన్లు: మారికావలస, గంభీరాం, తగరపువలస, భోగాపురం

45
Vizag Metro Project Vizag Metro Project

వైజాగ్ మెట్రో.. గ్రీన్ మెట్రో కాన్సెప్ట్

విశాఖపట్నం మెట్రోను పూర్తిగా పర్యావరణ అనుకూలంగా ఉండేలా అభివృద్ధి చేస్తున్నారు. ఇది కార్బన్ ఉద్గారాలను దాదాపు జీరో లెవల్ కు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కువగా సౌరశక్తిని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ప్రయాణాన్ని మరింత హాయిగా మార్చేందుకు ట్రాక్ వెంట పచ్చదనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

55
Smart City Transport Vizag Vizag Metro Project

స్టేషన్లు, డిపోలు, సర్వీస్ భవనాలు, వయాడక్టులు, పార్కింగ్ షెల్టర్లపై సోలార్ పివి ప్యానెల్స్ ను ఏర్పాటు చేసి, పగటి సమయంలో సహజ విద్యుత్‌ను ఉపయోగించనున్నారు. ఈ సోలార్ గ్రిడ్ ద్వారా సాధారణ సేవల కోసం అవసరమైన విద్యుతును స్వయంగా ఉత్పత్తి చేస్తారు. మిగిలిన విద్యుతును ఇతర సంస్థలకు సరఫరా చేయగల సామర్థ్యాన్ని కూడా ఈ వ్యవస్థ కలిగి ఉంటుంది.

మెట్రో స్టేషన్లను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) నిర్దేశించిన ప్లాటినం రేటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్నారు. మొత్తంగా విశాఖపట్నం మెట్రో, స్మార్ట్ టెక్నాలజీతో పాటు పర్యావరణ పరిరక్షణను టార్గెట్ గా పెట్టుకుంది. 

Read more Photos on
click me!

Recommended Stories