చేపలవేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు భరోసా
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 16 వరకు చేపల ఉత్పత్తి కాలం కావడంతో వేటపై నిషేధం ఉంటుంది. దీంతో సమయంలో మత్స్యకారులకు ఉపాధి తగ్గిపోవడం సహజం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసింది.
గతంలో వైకాపా ప్రభుత్వం ఈ పథకం లబ్దిదారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించేంది. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది.