ప్రధాన నిందితుల కోసం వేట.. విశాఖలో పెరుగుతున్న అనైతిక స్పా సెంటర్లు
ఈ కేసులో యజమానులు అరుణ్ కుమార్ (A1), రాహుల్ (A2) ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటికే మేనేజర్లు కల్లూరు పవన్ కుమార్ (A3), జానా శ్రీనివాస్ (A4), కస్టమర్ చీలి రామచంద్ర ప్రసాద్ (A5)లను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని స్పా సెంటర్లు చట్టబద్ధంగా నడవాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
విశాఖ స్మార్ట్ సిటీగా ఎదుగుతున్నప్పటికీ, ఇటువంటి కార్యకలాపాలు నగర ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. సిరిపురం, ద్వారకానగర్, రామ్‌నగర్, సీతమ్మపేట ప్రాంతాల్లో కూడా ఇలాంటి స్పా సెంటర్లు విస్తరిస్తున్నాయని సమాచారం. యువతులను ఉద్యోగాల పేరుతో ఆకర్షించి, తర్వాత బలవంతంగా ప్రాస్టిట్యూషన్ లోకి దింపుతున్నారని బాధితులు చెబుతున్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ల ద్వారా కస్టమర్లను సంప్రదిస్తూ ఈ దందాను సాగిస్తున్నారని సమాచారం.