Rain Alert : తీరందాటిన వాయుగుండం ... ఈ ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల్లో కుండపోత తప్పదా?

Published : May 30, 2025, 08:58 AM ISTUpdated : May 30, 2025, 09:34 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దీనికి తోడు రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. దీంతో  ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి.. శుక్రవారం వర్షాలు ఎలా ఉండనున్నాయో వాతావరణ శాఖ ప్రకటించింది. 

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Weather Updates : నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటింది... దీని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది.

25
తీరందాటిన వాయుగుండం.. అక్కడ కుండపోత వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బంగ్లాదేశ్ లోని ఖేపుపర వద్ద తీరం దాటింది... దీంతో పశ్చిమబెంగాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ఏపీలో చెదురుమదురు జల్లులు పడతాయని... కోస్తాంధ్రలోని కొన్నిచోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

35
ఆకస్మిక వరదలకు ఛాయిస్... తస్మాత్ జాగ్రత్త

వాయుగుండం ప్రభావంతో సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి మత్స్యకారులు మే 31 వరకు సముద్రంలోకి చేపలవేటకు వెళ్ళకూడదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలకు అవకాశాలుంటాయి... కాబట్టి నదీతీరాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

45
ఈ ఏపీ జిల్లాల్లో భారీ వర్షాలు

శుక్రవారం అంటే ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల కడప, తిరుపతి జిల్లాల్లో సాధారణం నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు. మిగతా జిల్లాలో ఆకాశం మేఘాలతో కప్పేసి వాతావరణం చల్లగా ఉంటుందని... అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురుస్తాయని ప్రకటించింది.

55
తెలంగాణలో వర్షాలు

ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ లో శుక్రవారం వర్షాలు కురవకున్నా వాతావరణం మాత్రం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది... సాయంత్రం అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయట. అయితే ఈ వాయుగుండం, రుతుపవనాల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం సూచిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories