TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల

Published : Oct 06, 2026, 09:38 PM IST

TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది.

PREV
14
అక్టోబర్ 7న రూ.300 దర్శనం టికెట్ల విడుదల

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కొన్ని తేదీలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీల్లో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను అక్టోబర్ 7వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. దర్శన టికెట్లు కావాల్సిన భక్తులు నిర్ణీత సమయంలో అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌లో బుక్ చేసుకోవాలి.

24
అధికారిక వెబ్‌సైట్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవాలి

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచించారు. నకిలీ వెబ్‌సైట్లు, అనధికారిక లింకులు లేదా మధ్యవర్తుల ద్వారా టికెట్లు పొందేందుకు ప్రయత్నిస్తే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. దర్శనానికి వెళ్లే ముందు టికెట్ వివరాలు, తేదీ, సమయం వంటి అంశాలను సరిగ్గా పరిశీలించుకోవాలని సూచించారు.

34
10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలకు విరామం

నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మినహాయించి మిగిలిన వీఐపీ బ్రేక్ దర్శనాలను ఈ పది రోజుల పాటు నిలిపివేయనుంది. సాధారణ భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా దర్శనం చేసుకునేలా ఈ నిర్ణయం తీసుకుంది.

44
ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలపై కీలక మార్పులు

వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, డిఫెన్స్ సిబ్బందికి కల్పించే ప్రత్యేక దర్శనాలను కూడా తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. మరోవైపు అక్టోబర్ 10 నుంచి 19 వరకు సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో సాధారణ భక్తులకు వీలైనంత మెరుగైన దర్శన సౌకర్యం కల్పించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు. భక్తులు ఈ మార్పులను ముందుగానే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Read more Photos on
click me!

Recommended Stories