వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రోజువారీ అప్‌డేట్లను పరిశీలిస్తే:
• డే-1 (05-10-2026 రాత్రి 20:00 నుండి 06-10-2026 ఉదయం 08:30 వరకు): కోస్తాంధ్ర, యానాంలో ఒకటి లేదా రెండు చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడవచ్చు. పిడుగులు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
• డే-2 (06-10-2026 ఉదయం 08:30 నుండి 07-10-2026 ఉదయం 08:30 వరకు): కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురుస్తాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే సూచనలు ఉన్నాయి.
• డే-3 (07-10-2026 ఉదయం 08:30 నుండి 08-10-2026 ఉదయం 08:30 వరకు): రెండు ప్రాంతాల్లోనూ ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు 30-40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి.
• డే-4 (08-10-2026 ఉదయం 08:30 నుండి 09-10-2026 ఉదయం 08:30 వరకు): ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేవు.
• డే-5 నుండి డే-7 వరకు (09-10-2026 ఉదయం 08:30 నుండి 12-10-2026 ఉదయం 08:30 వరకు): ఈ మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి వర్ష సూచన ఉంది. హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.