ఇప్పటివరకు అన్నప్రసాదంలో పచ్చడి, స్వీట్, అన్నం, పప్పు, కూర, సాంబార్, రసం, మజ్జిగ పులుసు మాత్రమే ఉండేవి. ఇకపై వీటితో పాటు వడ కూడా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు వడలను వడ్డించనున్నారు.
టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు స్వయంగా ప్రారంభోత్సవంలో పాల్గొని భక్తులకు వడలు వడ్డించారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.