Andhra Pradesh Rain Alert : ఏపీలో ఆకస్మిక వరదలు రావచ్చు... ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త

Published : May 29, 2025, 08:58 AM ISTUpdated : May 29, 2025, 09:11 AM IST

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.  ఈ క్రమంలో  ఆంధ్ర ప్రదేశ్ లో ప్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయంటే… 

PREV
16
మరో రెండ్రోజులు ఏపీలో వర్షాలే వర్షాలు

Weather : ఆంధ్ర ప్రదేశ్ అంతటా నైరుతి రుతుపవనాలు వ్యాపించాయి. దీంతో ఆకాశంలో నల్లని మబ్బులు కమ్మేసి వాతావరణం పూర్తిగా చల్లబడింది... వర్షాలు మరింత జోరందుకున్నాయి. మరో రెండ్రోజులు (బుధ, గురువారం) కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

26
ఏపీకి ప్లాష్ ప్లడ్స్ ప్రమాదం

ఏపీతో పాటు ఎగువన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి, కృష్ణా నదుల్లోకి భారీగా వరదనీరు చేరి నీటిమట్టం పెరుగుతోంది. అలాగే వాగులు వంకలు వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని విపత్తు నిర్వమణ సంస్థ హెచ్చరించింది. కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను ఇప్పటికే అలర్ట్ చేసింది ప్రభుత్వం.

36
ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన

ఇవాళ(గురువారం) ఏపీలో ఏయే జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో వాతావరణ శాఖ ప్రకటించింది. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం , అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూల్, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. శుక్రవారం కూడా ఈ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించారు.

46
ఏపీలో రికార్డు వర్షపాతం

నిన్న(బుధవారం) శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అత్యధికంగా 31 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అంతకుముందు మంగళవారం అయితే సంతబొమ్మాళిలో ఏకంగా 152 మి.మీ రికార్డు వర్షపాతం నమోదయ్యింది. నైరుతి రుతుపవనాల ప్రభావం గట్టిగా ఉంటుందని.. రాబోయే రోజుల్లో కుండపోత వర్షాల కురుస్తాయని ఐఎండి హెచ్చరిస్తోంది.

56
తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్

ఇక తెలంగాణలో కూడా రుతుపవనాలు వ్యాపించాయి. దీంతో వర్షాలు మరింత పెరిగాయి. మరో మూడురోజులు అంటే ఈ నెల మొత్తం వర్షాలే వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశమున్న ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.

66
ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలే వర్షాలు

ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

Read more Photos on
click me!

Recommended Stories