NTR: నిజంగానే చంద్ర‌బాబు ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచారా.? అస‌లు ఆ స‌మ‌యంలో ఏం జ‌రిగింది

Published : May 28, 2025, 12:46 PM IST

నంద‌మూరి తార‌క రామ‌రావు 102వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహానాడు వేదికగా సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఘ‌నంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ఓ వివాస్ప‌ద అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
17
ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు..

నంద‌మూరి తార‌క రామ‌రావు.. తెలుగు ప్ర‌జ‌ల‌కు ఈ పేరును ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. క‌థా నాయ‌కుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా చ‌రిత్ర‌పై చెర‌గ‌ని ముద్ర వేశారు ఎన్టీఆర్‌. సినిమాల్లో ఎన్నో అపురూప పాత్రలను పోషించి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ కీర్తిని సంపాదించుకున్నారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చి అంతకంటే ఎక్కువ పేరును గడించారు. తెలుగు వారి ఆత్మ గౌరవ ప్రతీక అంటూ టీడీపీ పార్టీని ఏర్పాటు చేసి, కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు.

27
ఎన్నో సంస్క‌ర‌ణ‌లు..

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, పేదలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించే విధంగా రూ. 2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా స్త్రీలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉండాలి అనే సంస్కరణను రాష్ట్రంలో మొదటగా ప్రవేశపెట్టినవారిలో ఎన్టీఆర్ ఒకరు. ఇది తరువాత దేశవ్యాప్తంగా చట్టంగా మారింది. ఎన్టీఆర్ పాలనలో మద్యం విక్రయాన్ని పూర్తిగా నిషేధించే నిర్ణయం తీసుకున్నారు.

మహిళలకు రాజకీయాల్లో చోటు కల్పించడంలో ఎన్టీఆర్ కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా జిల్లా పరిషత్తుల, మండల స్థాయి సంస్కరణల ద్వారా మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారు. గ్రామ స్థాయిలో పాలనకు సమర్ధంగా మద్దతుగా మండలాలుగా పంచాయతీ వ్యవస్థను పునర్నిర్మించారు, ఇది స్థానిక పరిపాలనలో భాగస్వామ్యాన్ని పెంచింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారు ఎన్టీఆర్.

37
ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కీలక మలుపు..

1994 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ తర్వాత పార్టీలో కొన్ని విభేధాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం, రెండో భార్య ల‌క్ష్మీ పార్వ‌తి ప్రాధాన్య‌త పార్టీలో క్ర‌మంగా పెర‌గ‌డం, కొన్ని నిర్ణ‌యాలు నేరుగా ల‌క్ష్మీ పార్వ‌తి తీసుకుంటోంద‌న్న కార‌ణాల‌తో పార్టీ నాయ‌కుల్లో అసంతృప్తి మొద‌లైంది.

47
అస‌లీ వెన్నుపోటు ప‌దం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది?

ఈ పరిణామాల నేప‌థ్యంలోనే పార్టీ నేత‌లు తిరుగుబాటు చేయ‌డం మొదలు పెట్టారు. ఆగస్టు 1995లో హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోట‌ల్ సంఘ‌ట‌నతో తిరుగుబాటు ప‌రాకాష్ట‌కు చేరింది. ఆ తిరుగుబాటుకు చంద్ర‌బాబు నాయ‌క‌త్వం వ‌హించార‌ని చెబుతారు. హోట‌ల్‌కు చేరుకున్న పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబు నేతృత్వంలో సమావేశమై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

తమకు ఎన్టీఆర్ నాయకత్వంపై విశ్వాసం లేదని ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ త‌న ప‌ద‌వి కోల్పోగా, నాయ‌కులంతా చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్నారు. దీంతో చంద్ర‌బాబు, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచార‌న్న ప్ర‌చారం మొద‌లైంది.

57
దీనిపై చంద్ర‌బాబు నాయుడు ఏమ‌న్నారంటే?

ఈ వ్యవహారంపై అప్పట్లో చంద్రబాబు నాయుడు “పార్టీని కాపాడటానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను” అని వ్యాఖ్యానించారు. “ఎన్టీఆర్‌పై త‌మ‌కు ఎలాంటి ద్వేషం లేదు.. కానీ కొంద‌రు వ్య‌క్తులు అన‌వ‌స‌రంగా త‌ల‌దూర్చ‌డం, పార్టీ వ్య‌వ‌హారాల్లో త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వంటి వాటితో పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో ప‌డింది. పార్టీని, ప్రభుత్వాన్ని నిల‌బెట్టుకోవాల‌ని త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది" అని తెలిపారు. ఇప్ప‌టికీ ఆరోజు చేసిన ప‌ని అనివార్యంగా చేయాల్సి వ‌చ్చింద‌ని అంటుంటారు చంద్ర‌బాబు.

67
చంద్ర‌బాబును వ్య‌తిరేకించే వారి వాద‌న ఏంటంటే?

ఇక చంద్ర‌బాబును వ్య‌తిరేకించే వారికి ఎన్నో ఏళ్ల నుంచి ఇదొక అస్త్రంగా మారింది. చంద్ర‌బాబు త‌న మామ‌ను వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీలో కూర్చున్నారంటూ విమ‌ర్శిస్తారు. ఎన్టీఆర్ మ‌ర‌ణానికి చంద్ర‌బాబుతో పాటు ఎన్టీఆర్ సొంత కొడుకులే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తుంటాయి.

77
ప్ర‌జ‌ల‌పై ఈ ప్ర‌భావం త‌క్కువేన‌ని చెప్పాలి..

చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచార‌న్న దానికి రాజ‌కీయ ప్రాధాన్య‌త లేద‌ని చ‌రిత్ర ఎప్పుడే నిరూపించింది. ఎన్టీఆర్‌ను ప‌ద‌వి నుంచి దించిన త‌ర్వాతి ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి రావ‌డం, చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావ‌డ‌మే దీనికి సాక్ష్య‌మ‌ని చంద్ర‌బాబు వ‌ర్గీయులు చెబుతుంటారు. కానీ వెన్నుపోటు అనే వాద‌న ఇప్ప‌టికీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గానే ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories