ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణలోనూ వాతావరణం కూల్ అయింది. సోమవారం హైదరాబాద్ నగరంలో ఉదయం ఆహ్లాదకరంగా ఉండి, మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది.
ఇక ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. మరోవైపు అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని, టార్పాలిన్లతో కవర్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.