చరిత్రలో నిలిచిపోయేలా సత్యసాయి శత జయంతి వేడుకలు.. 100 రోజుల పాటు 100 దేశాలను ఏకం చేస్తూ

Published : Aug 11, 2025, 03:37 PM ISTUpdated : Aug 11, 2025, 04:47 PM IST

Sathya Sai Baba: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరగుతున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా 100 రోజుల పాటు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

PREV
15
100 దేశాలను ఏకం చేసే మహా ఉత్సవం

కర్నాటకలోని ముద్దెనహళ్లి సత్యసాయి గ్రామం, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పక్కన, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు వేదిక కానుంది. ఆగస్టు 16 నుంచి నవంబర్ 23 వరకు 100 రోజుల పాటు, 100 దేశాల ప్రతినిధులు, కళాకారులు, ఆధ్యాత్మిక నాయకులు ఒకే వేదికపై కలిసే వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ చేపడుతోంది.

DID YOU KNOW ?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రి
నవంబర్ నెలలో 600 పడకల సామర్థ్యం కలిగిన ప్రైవేటు ఉచిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం కానుంది. ఇక్కడ ఎలాంటి బిల్లింగ్ కౌంటర్ ఉండదు.
25
ప్రతీ రోజు ఒక దేశం – సాంస్కృతిక వైభవం

ఈ 100 రోజుల మహోత్సవంలో ప్రతీ రోజు ఒక దేశానికి అంకితమవుతుంది. ఆ దేశానికి చెందిన కళాకారులు నృత్యం, సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తారు. అలాగే, ఆ దేశపు ఆధ్యాత్మిక మూలాలు, చరిత్ర, సంప్రదాయాలపై ప్రత్యేక ప్రసంగాలు జరుగుతాయి. రోజు చివర్లో ఆధ్యాత్మిక గురువు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి ఉపన్యాసం ఇస్తారు. అదే రోజు ఆ దేశంలో సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేసిన వ్యక్తికి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ప్రదానం చేస్తారు.

35
ఆధ్యాత్మిక వేడుకలు, యజ్ఞాలు, పూజలు

శరన్నవరాత్రుల సమయంలో అతిరుద్ర మహా యజ్ఞం, దుర్గాపూజ వంటి ముఖ్య ఆధ్యాత్మిక కార్యాక్రమాలు జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు పాల్గొనే వీలున్న ఈ యజ్ఞాలు, సాంప్రదాయాలను కాపాడుతూ, భక్తి భావాన్ని పెంపొందించేలా ఉంటాయి.

45
ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత ఆసుపత్రి ప్రారంభం

నవంబర్ నెలలో 600 పడకల సామర్థ్యం కలిగిన ప్రైవేటు ఉచిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం కానుంది. ఇక్కడ ఎలాంటి బిల్లింగ్ కౌంటర్ ఉండదు. జాతి, మతం, కులం, ఆర్థిక స్థితి తేడా లేకుండా ఎవరైనా ఉచిత వైద్యం పొందగలరు. ఇది ఆరోగ్య రంగంలోనే కాదు, సేవా రంగంలో కూడా ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది.

55
సాయి సింఫనీ, మతాల శిఖరాగ్ర సమావేశం

40 దేశాల నుంచి వచ్చిన 400 మంది మ్యూజీషియన్లతో సాయి సింఫనీ వరల్డ్ ఆర్కెస్ట్రా ప్రదర్శన జరుగుతుంది. వీరిలో 170 మంది సత్యాసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ విద్యార్థులు కావడం విశేషం. నవంబర్‌లో ప్రపంచ మతాల శిఖరాగ్ర సమావేశం కూడా జరుగుతుంది. ఇందులో వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మిక నాయకులు శాంతి, ఏకత్వం, సహనంపై తమ ఆలోచనలను పంచుకుంటారు. నవంబర్ 23న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి కార్యక్రమంతో ఈ మహోత్సవం ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories