Air India Express Freedom Sale: ఎయిరిండియా ‘ఫ్రీడమ్ సేల్’లో భాగంగా కేవలం రూ.1,279కే విమాన టిక్కెట్లు అందిస్తోంది. ఆగస్టు 15 వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆఫర్‌లో దేశీయ ప్రయాణాలకు తక్కువ ధరలో టిక్కెట్లు పొందవచ్చు.
Air India Express Freedom Sale: భారత దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ భారీ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకవచ్చింది. "ఫ్రీడమ్ సేల్" పేరుతో ఫ్లైట్ టిక్కెట్ల ధరపై స్పెషల్ ఆఫర్స్ ప్రకటించింది. ఎంతలా అంటే.. బస్ టికెట్ ధరలోనే విమానంలో ప్రయాణించవచ్చు. తరచుగా విమాన ప్రయాణం చేసే వారికి మాత్రమే కాకుండా, విమానం ఎక్కాలనే కోరుకునే వారికి కూడా ఇది సువర్ణావకాశం. ఈ సేల్ కింద ఎంపిక చేసిన మార్గాల్లో 50 లక్షల సీట్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.
25
దేశీయ టికెట్లు రూ.1279, అంతర్జాతీయ టికెట్లు రూ.4279
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్రీడమ్ సేల్‌లో దేశీయ విమాన టికెట్లు కేవలం రూ.1279 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక అంతర్జాతీయ టికెట్లు విషయానికి వస్తే.. కేవలం రూ. 4279 నుంచి అందుబాటులో ఉన్నాయి. మొత్తం 50 లక్షల సీట్లు కేటాయించగా, బుకింగ్ ఆగస్టు 15 అర్థరాత్రి వరకు కొనసాగుతుంది.
ఈ ఆఫర్‌లో బుక్ చేసిన టికెట్లతో ఆగస్టు 19,2025 నుంచి మార్చి 31, 2026 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. వచ్చే శీతాకాలం, వేసవి కాలంలో ఏదైనా టూర్ వెళ్లాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు.
35
బుకింగ్ చేసుకోండిలా..
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ లేదా వారి మొబైల్ యాప్ ద్వారా ఈ ఫ్రీడమ్ సేల్ టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. దీపావళి, దుర్గాపూజ, ఓనం, క్రిస్మస్ వంటి పండుగల సీజన్‌లో ప్రయాణాలకు ఈ సేల్ చాలా ఉపయోగకరమని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. అయితే.. టికెట్ బుకింగ్, ప్రయాణం మధ్య కనీసం నాలుగు రోజుల వ్యవధి ఉండాలని కూడా సూచించింది.
ఇక ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ లైట్ ఆప్షన్ ద్వారా తక్కువ ధరకే బ్యాగేజ్ చెక్-ఇన్ లేకుండా ప్రయాణం చేయవచ్చని ఎయిరిండియా తెలిపింది. అయితే, చెక్-ఇన్ బ్యాగేజ్ అవసరం ఉంటే ఎక్స్‌ప్రెస్ వాల్యూ టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఈ ధరలు దేశీయ రూట్లలో రూ.1379 నుండి ప్రారంభమవుతుండగా, ఇంటర్నేషన్ ట్రిప్స్ ల్లో రూ.4479 నుంచి ప్రారంభమవుతున్నట్లు ఎయిరిండియా తెలియజేసింది. అదనంగా, మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఎక్స్‌ప్రెస్ బిజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉందని తెలిపింది. ఈ బిజన్ ఆప్షన్ ద్వారా 58 అంగుళాల ప్రీమియం సీట్లు లభిస్తాయి. ఇది 40కి పైగా విమానాల్లో అందుబాటులో ఉందని పేర్కొంది.
55
ప్రత్యేక రాయితీలు, అదనపు ప్రయోజనాలు
అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ లాయాల్టీ ప్రోగ్రామ్ సభ్యులకు ప్రత్యేక బెనిఫిట్స్ అందజేస్తోంది. ఎక్స్‌ప్రెస్ బిజినెస్ క్లాస్ టికెట్లపై 25 శాతం డిస్కౌంట్ ఇచ్చినట్లుగా, అలాగే బ్యాగేజ్ ఛార్జీలు, హాట్ మీల్స్, సీట్ ఎంపిక వంటి సేవలపై 20 శాతం అదనపు తగ్గింపుతో అందిస్తున్నట్టు తెలిపింది. మరో ముఖ్య విషయమేమిటంటే.. విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, సాయుధ దళాల సిబ్బంది కూడా ప్రత్యేక రాయితీలు పొందుతున్నారు.