ఈ వర్షాకాలంలో మొదటిసారి వర్షాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థలకు సెలవు రావడం. తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తున్నారు అధికారులు.
School Holidays : ఎల్ నినో ప్రభావంతో ఇంతకాలం ముఖం చాటేసిన వర్షాలు ఇప్పుడు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు కాస్త అనుకూలంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి... ముఖ్యంగా ఉత్తరాంద్ర జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో నదులు, వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి... జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. ఇలాంటి సమయంలో రాబోయే రెండుమూడు రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా వర్ష ప్రభావిత జిల్లాల్లో సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
24
శ్రీకాకుళంలో విద్యాసంస్థలకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి అతిభారీ వర్షాలను కురిపించనుందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అతి తక్కువ సమయంలోనే అత్యధిక వర్షపాతం నమోదై ప్లాష్ ప్లడ్స్ కు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. అందుకే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.
ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి... రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 23, 24) తేదీల్లో వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు... జిల్లాలోని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. అయితే స్థానిక పరిస్థితుల ఆధారంగా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు (MEO) కలిసి సెలవుపై తుది నిర్ణయం తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు.
34
ఈ జిల్లాల్లోనూ స్కూళ్లకి సెలవు ఉంటుందా?
కేవలం శ్రీకాకుళం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్ర మొత్తం జోరువానలు కురుస్తున్నాయి. దీంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు ఎక్కువగా ఉంటే విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నుండి కూడా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి... కాబట్టి ఏ నిమిషమైన సెలవుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా బలపడింది... రాబోయే 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఒడిశాలోని గోపాల్‌పూర్ కు 220 కిమీ, పూరీకు 220 కిమీ, కళింగపట్నంకు 230 కిమీ, విశాఖపట్నంకు 320 కిమీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతం అయినట్లు APSDMA తెలిపింది.
సెప్టెంబర్ 23న అంటే రేపు (బుధవారం) వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారుతుందట... ఇదేరోజు రాత్రికి లేదా సెప్టెంబర్ 24 (గురువారం) తెల్లవారుజామున విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని APSDMA అంచనా వేస్దోంది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు (మంగళ, బుధవారం) శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.