School Holidays
Holidays : తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ఈ ఏప్రిల్ నెలలో వరుస సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే గత వీకెండ్ లో రెండ్రోజులు అంటే శని, ఆదివారం సెలవులు వచ్చాయి. ఇక రాబోయే వీకెండ్ లో వరుసగా మూడ్రోజులు (శని, ఆది, సోమవారం) సెలవులు వస్తున్నాయి. ఈ మధ్యలో మరో మరో సెలవు కూడా ఉంది... అయితే ఇది కేవలం కొన్ని విద్యాసంస్థలకు మాత్రమే వర్తించనుంది. ఇలా ప్రత్యేక సెలవు వర్తించే విద్యాసంస్థలేవో ఇక్కడ తెలుసుకుందాం.
School Holidays
గురువారం అధికారిక సెలవే... కానీ వారికి మాత్రమే :
ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణకు జైన మతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ప్రాంతాల్లో అనేక జైనతీర్థాలు ఉన్నాయి... తెలంగాణలోని కొలనుపాక ఇందులో ప్రత్యేకమైనది. ఇరు రాష్ట్రాల్లోనూ జైన్స్ గుర్తించదగిన స్థాయిలో ఉన్నారు. ఈ క్రమంలో జైనుల ఆరాధ్యదైవం, 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడి జయంతి సందర్భంగా ఏప్రిల్ 10న సెలవు ఇచ్చారు.
అయితే ఈ సెలవు అందరికి వర్తించదు. మహవీర్ జయంతికి సాధారణ సెలవు కాకుండా ఐచ్చిక సెలవు ప్రకటించాయి ఇరు తెలుగు రాష్ట్రాలు. ఈ క్రమంలో కేవలం జైనులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని స్కూళ్లకు ఈ సెలవు వర్తించనుంది. జైన మతానికి సంబంధించిన ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా సెలవు ఉంటుంది. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని విద్యాసంస్థలకు మాత్రమే సెలవు ఉండనుంది... మిగతా స్కూళ్లు, కాలేజీలు యధావిధిగా నడుస్తాయి.
ఇక ఈ ఏప్రిల్ 12 నుండి అంటే వచ్చే శనివారం నుండి మాత్రం అన్ని విద్యాసంస్థలకు మూడ్రోజుల సెలవు ఉంటుంది. ఏప్రిల్ 12న రెండో శనివారం, ఏప్రిల్ 13న ఆదివారం సాధారణ సెలవులు. ఇక ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సెలవు ఇచ్చారు. కాబట్టి రేపు సెలవు రాకున్నా రెండ్రోజుల తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి.
School Holidays
వచ్చేవారం కూడా వరుసగా మూడ్రోజులు సెలవు :
ఈవారం ఇలా సెలవులు ముగుస్తాయో లేదో వచ్చేవారం మరో సెలవు రెడీగా ఉంది. ఏప్రిల్ 18న క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే గుడ్ ప్రైడే ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో అధికారిక సెలవు ఉంది. కేవలం విద్యాసంస్థలకే కాదు ఉద్యోగులకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది.
తర్వాతిరోజు శనివారం కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది ఆదివారం. ఇలా వచ్చేవారం కూడా కొందరు విద్యార్థులకు వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఏప్రిల్ 18,19,20 తేదీల్లో సెలవు ఉండనుంది. ఏప్రిల్ 19 సెలవు కొన్ని విద్యాసంస్థలకే వర్తిస్తుంది.
ఇక ఈ ఏప్రిల్ లోనే విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే ఇంటర్మీడియట్, పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగిసాయి. ఇక మిగతా విద్యార్థులకు కూడా ఈ నెలాకరుకు పరీక్షలు ముగియనున్నాయి. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో చదివే విద్యార్థులకు ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు రానున్నాయి. దాదాపు నెలన్నరపాటు రెండు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలన్నీ మూత పడతాయి.