Published : Jun 12, 2025, 10:46 AM ISTUpdated : Jun 12, 2025, 10:56 AM IST
వేసవితోనే సెలవులు ముగియవు.. ప్రతి అకడమిక్ ఇయర్ లో స్కూళ్ళకు అనేక సెలవులు వస్తాయి. ఇలా ఈ విద్యాసంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు ఎన్నిరోజుల సెలవులు రానున్నాయో తెలుసా?
School Holidays : తెలుగు విద్యార్థులకు నేటితో (జూన్ 12, గురువారం) వేసవి సెలవులు ముగియనున్నాయి. దీంతో దాదాపు రెండు నెలలుగా సెలవులు ఎంజాయ్ చేసిన స్టూడెంట్స్ భుజాన బ్యాగులేసుకుని బడిబాట పడుతున్నారు. ఇలా మళ్ళీ బడిగంటల సవ్వడి వినిపిస్తోంది.
అయితే ఇన్నిరోజులు ఇంటివద్దే గడిపిన చిన్నారులను ఒక్కసారిగా స్కూల్ కి పొమ్మంటే కాస్త బాధగానే ఉంటుంది. కానీ ఈ అకడమిక్ ఇయర్ లో వచ్చే సెలవుల గురించి తెలిస్తే విద్యార్థుల బాధ ఇట్టే మాయమవుతుంది... వాళ్లు ఎగిరిగంతేస్తారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థలకు ఈ విద్యా సంవత్సరం 2025-26 లో ఎన్ని సెలవులు వస్తున్నాయో ఇక్కడ చూద్దాం.
26
ఏపీలో సెలవులే సెలవులు
ఆంధ్ర ప్రదేశ్ లో 316 రోజులపాటు ఈ విద్యాసంవత్సరం కొనసాగుతుందని విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో మొత్తం పనిదినాలు 233 రోజులు మాత్రమే... మిగతా 83 రోజులు సెలవులే. దసరా, సంక్రాంతి వంటి ముఖ్యమైన పండగలకు వరుస సెలవులు వస్తాయి.. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్, ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలకు రంజాన్ సందర్భంగా ప్రత్యేకంగా సెలవులు ఇస్తారు.
దసరా పండక్కి సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇవ్వనున్నట్లు అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొన్నారు. డిసెంబర్ 2025లో క్రిస్మస్ సందర్భంగా అన్ని విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవులు రానున్నాయి... కానీ క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం డిసెంబర్ 21 నుండి 28 వరకు సెలవులు ఇవ్వనున్నారు. ఇక సంక్రాంతికి 2026 జనవరి 10 నుండి 18 వరకు సెలవులు రానున్నాయి.
జూన్ 12, 2025 అంటే ఇవాళ్టి నుండి ఏపీలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం అవుతోంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ తెరుచుకుంటున్నాయి. వచ్చే ఏడాది 2026, ఏప్రిల్ 24తో విద్యాసంవత్సరం ముగుస్తుంది. ఈ మధ్యలో స్కూళ్లకు పండగలు, ప్రత్యేక రోజులు, జాతీయ దినోత్సవాలు, స్థానిక వేడుకల సందర్భంగా సెలవులు వస్తాయి.
56
వేసవిలోనే కాదు వర్షాకాలం కూడా సెలవులు
సాధారణంగా వేసవిలో విద్యాసంస్ధలకు సెలవులు వస్తాయి... కానీ కొన్నేళ్ళుగా వర్షాకాలంలో కూడా సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల సమయంలో విద్యార్థులు ప్రమాదాలబారిన పడకుండా ప్రభుత్వమే సెలవులు ఇస్తోంది. అయితే ఈ సెలవులు ఒక్కోసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు వర్తిస్తున్నాయి... చాలా సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో వర్షాలను బట్టి సెలవులు ఉంటున్నాయి. మొత్తంగా ఎండాకాలంలో మాదిరిగానే వర్షాకాలంలో కూడా సెలవులు వస్తున్నాయి.
66
విద్యాసంస్థలకు సడన్ సెలవులు
ఇక స్టూడెంట్స్, ఇతర యూనియన్స్, రాజకీయ పక్షాల బంద్ ల కారణంగా కూడా విద్యాసంస్థలకు సడన్ సెలవులు రావచ్చు. స్థానిక వేడుకలు, ఉత్సవాల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక సెలవులు వస్తాయి. ఇలాంటి సెలవులపై జిల్లాల విద్యాశాఖ (DEO), మండల విద్యాశాఖ (MEO) అధికారులు, స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్ స్కూల్స్ లో అయితే యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటారు.
కాబట్టి కేవలం వేసవితోనే సెలవులు ముగిపోయాయని విద్యార్ధులు బాధపడవద్దు... ఈ అకడమిక్ ఇయర్ లో భారీ సెలవులు ఉన్నాయని విద్యార్థులు గుర్తించాలి. కాబట్టి ఎలాంటి బాధ లేకుండా స్కూలుకు వెళ్లండి... బాగా చదువుకుంటూ మధ్యమధ్యలో వచ్చే సెలవుల ఎంజాయ్ చేయండి. బాగా చదువుకుని పరీక్షలు బాగారాస్తే వచ్చే వేసవి సెలవులను బాగా ఎంజాయ్ చేయవచ్చు.