దేశవ్యాప్తంగా మూతపడే బ్యాంకులివే :
ఆంధ్ర ప్రదేశ్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ , పశ్చిమబెంగాల్, బిహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో గ్రామీణ బ్యాంకులు మూతపడనున్నాయి. వీటిస్థానంలో రాష్ట్రంలో కేవలం ఒకే గ్రామీణ బ్యాంక్ పనిచేయనుంది.
పశ్చిమ బెంగాల్ లో బంగియా గ్రామీణ వికాస్ బ్యాంక్, పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్, ఉత్తర బెంగాల్ బ్యాంకులు విలీనం కానున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లోబ బరోడా యూపీ బ్యాంక్, ఆర్యావర్త్ భ్యాంక్, ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంకులు.... బిహార్ లో దక్షిణ బిహార్ గ్రామీణ బ్యాంక్, ఉత్తర బిహార్ గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నారు.
ఇక కర్ణాటక లో కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంకు (KGVB),కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (KRB)విలీనం కానున్నాయి. మహారాష్ట్రలో కూడా మహారాష్ట్ర గ్రామీణ బ్యాంక్, విదర్భ కొంకన్ గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నాయి. ఇవిరెండు కలిసి మహారాష్ట్ర గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి.