కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్ కేంద్రంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిహార్ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, న్యాయమూర్తులు, కేంద్ర స్థాయి నాయకులు భారీగా హాజరయ్యారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ వేడుకకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరై కూడా వచ్చారు.
24
Revanth Reddy In AP
వేడుక ప్రాంగణానికి చేరుకున్న రేవంత్ రెడ్డిని మంత్రి లోకేష్, టీడీపీ నేతలు పుష్పగుచ్ఛంతో ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం ఇద్దరూ కలిసి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
34
Revanth Reddy In AP
ఈ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, నారా భువనేశ్వరి, పలువురు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి విజయవాడకు వచ్చిన సందర్భంగా, హెలిప్యాడ్ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.