8 ఏళ్ల క్రితం ఎకరం రూ. 60 ల‌క్ష‌లు, ఇప్పుడు ఏకంగా రూ. 6 కోట్లు.. ఏపీలో మరో శంషాబాద్

Published : Aug 11, 2026, 03:35 PM IST

Real estate: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి వేగం ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ ఒక్క‌సారిగా జోరందుకుంది.

PREV
15
ఎయిర్‌పోర్ట్‌తో కొత్త ఊపు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వ‌చ్చింది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభమైన విష‌యం తెలిసిందే. దీంతో విశాఖపట్నం, విజయనగరం పరిసర ప్రాంతాల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. విశాఖ నగరానికి దాదాపు 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ విమానాశ్రయం ఉండటంతో రవాణా, రోడ్లు, హోటళ్లు, వాణిజ్య కేంద్రాలు, నివాస ప్రాంతాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం పెరిగింది. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల సంఖ్య పెరిగే కొద్దీ పరిసర ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు కూడా విస్తరించే అవకాశం ఉంది.

25
ఎకరం భూమి రూ.60 లక్షల నుంచి రూ.6 కోట్లకు

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రభావం ముందుగా కనిపించిన రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. విమానాశ్రయం ప్రాజెక్ట్‌కు ముందు ఈ ప్రాంతంలో భూముల ధరలు తక్కువగా ఉండేవి. సుమారు 8 ఏళ్ల క్రితం ఎకరం భూమి రూ.60 లక్షల వరకు ఉన్నట్లు స్థానిక మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విమానాశ్రయం అందుబాటులోకి రావ‌డం, చుట్టుపక్కల మౌలిక వసతులపై దృష్టి పెరగడంతో భూములకు డిమాండ్ భారీగా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఎకరం ధర ఏకంగా రూ.6 కోట్ల వరకు పలుకుతున్నట్లు స‌మాచారం. అంటే ఎనిమిదేళ్ల వ్యవధిలో భూముల ధరలు దాదాపు పది రెట్లు పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది.

35
వెంచర్లు, విల్లాలు, టౌన్‌షిప్‌లకు భారీ డిమాండ్

విమానాశ్రయం రాకతో భోగాపురం చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగంలో పోటీ పెరిగింది. పెద్ద స్థలాలను కొనుగోలు చేసి లేఅవుట్లు అభివృద్ధి చేయడం, విల్లాలు నిర్మించడం, గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటు చేయడం వంటి ప్రాజెక్టులపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ సంస్థలు భోగాపురం పరిసరాల్లో భూములను పరిశీలిస్తున్నాయి. భవిష్యత్తులో ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విమానాశ్రయ సిబ్బంది, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు నివాస అవసరాలు పెరుగుతాయనే అంచనాలతో కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రస్తుతం గ్రామీణ వాతావరణంలో ఉన్న కొన్ని ప్రాంతాలు రానున్న రోజుల్లో నివాస, వాణిజ్య కేంద్రాలుగా మారే అవకాశం ఉంది.

45
స్టార్ హోటళ్ల నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ వరకు

భోగాపురం ఎయిర్‌పోర్ట్ కారణంగా కేవలం ఇళ్ల నిర్మాణమే కాకుండా ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, ఆఫీస్ స్పేస్‌లు, గిడ్డంగులు, కార్గో సంబంధిత కార్యకలాపాలకు అవకాశాలు ఏర్ప‌డ‌నున్నాయి. విమానాశ్రయాన్ని నిర్మించిన GMR సంస్థ కూడా ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా టౌన్‌షిప్‌తో పాటు ఇంటర్నేషనల్ స్కూల్‌ను నిర్మించే ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పెద్ద విమానాశ్రయం చుట్టూ ఇలాంటి ప్రాజెక్టులు రావడం వల్ల స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు కూడా విస్తరించే అవకాశం ఉంటుంది.

55
మారుతున్న భోగాపురం..

విమానాశ్రయం ప్రారంభం తర్వాత భోగాపురం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న మార్పులు కేవలం భూముల ధరల పెరుగుదలకే పరిమితం కావడం లేదు. రోడ్లు, రవాణా సదుపాయాలు, నివాస ప్రాంతాలు, హోటళ్లు, విద్యా సంస్థలు, వాణిజ్య ప్రాజెక్టులు ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు పెరుగుతున్నాయి. విమానాశ్రయానికి అనుసంధానంగా మౌలిక వసతులు మెరుగుపడితే భోగాపురం చుట్టుపక్కల గ్రామాలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. కొత్త పరిశ్రమలు, సంస్థలు, హోటళ్లు, వ్యాపారాలు వస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరగవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories