పథకంలో పేరు నమోదైనంత మాత్రాన డబ్బులు పడతాయని అనుకుంటే పొరపాటే. నిధులు అకౌంట్‌లో జమకావాలంటే కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి.
• e-KYC పూర్తవ్వాలి: మీ ఆధార్ సీడింగ్, ఇ-కేవైసీ కంప్లీట్ కాకపోతే తదుపరి విడత డబ్బులు నిలిచిపోతాయి.
• భూమి వివరాల ధృవీకరణ : మీ పేరు మీద ఉన్న వ్యవసాయ భూమి వివరాలు పోర్టల్‌లో సరిగ్గా వెరిఫై అయి ఉండాలి.
• బ్యాంకు ఖాతా సమాచారం: బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి, ఆక్టివ్‌గా ఉండాలి.
• అనర్హుల నిబంధనలు: ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఇన్ కమ్ టాక్స్ చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు.