Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో బీపీ, షుగర్ బాధితులు కోటికి పైనే! టాప్ 3 జిల్లాలు ఇవే!

Published : Nov 16, 2026, 10:23 AM IST

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో నిర్వహించిన విస్తృత ఆరోగ్య సర్వేలో ఏకంగా కోటిమందికి పైగా ఈ 2 వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. మరి ఏ జిల్లాలో ఎక్కువమంది బాధితులు ఉన్నారో తెలుసుకుందాం.

PREV
15
ఏపీలో కోటి మందికి పైగా బీపీ, షుగర్ బాధితులు

రాష్ట్రవ్యాప్తంగా 14 నెలల పాటు నిర్వహించిన NCD 4.0 (Non-Communicable Diseases) సర్వేలో ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే ఫలితాలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అధికారులు నివేదించారు. రాష్ట్రంలో కొత్తగా 12,23,185 మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 11,58,632 మందికి షుగర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఈ కొత్త కేసులను ఇప్పటికే ఉన్న బాధితుల సంఖ్యకు కలిపితే రాష్ట్రంలో మొత్తం 59.63 లక్షల మంది బీపీతో, 48.95 లక్షల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అంటే ఈ రెండు వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య 1,08,58,000 గా ఉంది. వీరిలో సుమారు 34 లక్షల మందికి బీపీ, షుగర్ రెండూ ఉన్నట్లు సర్వే వెల్లడించింది.

25
14 నెలల్లో 2.86 కోట్ల మందికి పరీక్షలు

ప్రజల్లో జీవనశైలి వ్యాధులను ముందుగానే గుర్తించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం NCD 4.0 కార్యక్రమాన్ని చేపట్టింది. గత ఏడాది సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నవంబర్ 10తో సర్వే పూర్తయింది. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ అధికారులు పరీక్షలు నిర్వహించారు. 18 ఏళ్లు పైబడిన వారిలో సుమారు 2.85 కోట్ల మందికి బీపీ, మధుమేహం, నోటి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు.

35
60 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువ కేసులు

వయస్సుల వారీగా చూస్తే 60 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్ కేసులు అత్యధికంగా ఉన్నాయి. మొత్తం బీపీ బాధితుల్లో 47.60 శాతం, మధుమేహ బాధితుల్లో 43.39 శాతం మంది ఈ వయస్సు వారే ఉన్నారు.

వయసు బీపీ బాధితులు షుగర్ బాధితులు

-------------- ------------- --------------

18–19 ఏళ్లు 11,827 10,360

20–29 ఏళ్లు 81,983 75,431

30–39 ఏళ్లు 2,89,865 2,86,680

40–49 ఏళ్లు 9,99,833 9,22,583

50–59 ఏళ్లు 17,41,147 14,76,353

60 ఏళ్లు పైబడినవారు 28,38,552 21,24,428

45
ఏ జిల్లాల్లో ఎక్కువ?

NCD 4.0 సర్వేలో కొత్తగా గుర్తించిన బీపీ కేసుల్లో విశాఖపట్నం, పశ్చిమగోదావరి, తిరుపతి, తూర్పుగోదావరి, వైఎస్సార్ కడప జిల్లాలు ముందున్నాయి.

కొత్త బీపీ కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాలు:

విశాఖపట్నం – 78,017

పశ్చిమగోదావరి – 68,802

తిరుపతి – 65,504

తూర్పుగోదావరి – 64,116

వైఎస్సార్ కడప – 63,141

కొత్త షుగర్ కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాలు:

విశాఖపట్నం – 80,692

పశ్చిమగోదావరి – 67,935

తిరుపతి – 67,827

వైఎస్సార్ కడప – 66,914

ప్రకాశం – 61,415

55
బాధితులకు ఉచిత వైద్యం

జీవనశైలి వ్యాధుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బీపీ, మధుమేహం వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, వాటి తీవ్రత పెరగకుండా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

ఈ సర్వే గణాంకాలను చూస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారిలోనూ భారీగా బీపీ, షుగర్ కేసులు ఉండటం జీవనశైలిలో మార్పుల అవసరాన్ని సూచిస్తోంది. సమతుల్య ఆహారం, రోజువారీ వ్యాయామం, తగిన నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి అలవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories