Andhra Pradesh: అన్నదాత సుఖీభవ...ఈకేవైసీ అవసరం లేదు... కానీ...!

Published : Jun 17, 2025, 09:42 AM IST

అన్నదాత సుఖీభవకు 1.45 లక్షల మంది రైతులకే ఈకేవైసీ అవసరం. మిగిలినవారికి అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

PREV
16
అన్నదాత సుఖీభవ పథకం

అన్నదాత సుఖీభవ పథకం కోసం కేవలం 1.45 లక్షల మంది రైతులకే ఈకేవైసీ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన రైతులు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు.

26
కేవలం 1.45 లక్షల మందికే అవసరం

మొత్తంగా 45.65 లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడ్డారు. అయితే వీరిలో 44.19 లక్షల మందికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఇప్పటికే పూర్తివివరాలు ఉన్నాయి. కేవలం 1.45 లక్షల మంది రైతుల వివరాలే ప్రభుత్వ డేటాలో లేవని స్పష్టమైంది. అందుకే ఈ రైతులకే ఈకేవైసీ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. ఈ జాబితాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలకు ప్రభుత్వం పంపించింది.

36
రైతుల ఆందోళనకు పరిష్కారం

పథకానికి అర్హులేమోననే సందేహంలో ఉన్న రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌లో "Check Status" ఆప్షన్‌ ను ప్రారంభించాలనుకుంటోంది. ఇందులో ఆధార్ నంబర్ నమోదు చేయగానే, రైతు అర్హత వివరాలు, ఈకేవైసీ అవసరముందో లేదో అన్నదీ తెలిసేలా ఏర్పాట్లు చేస్తోంది.

46
ఈ నెల 20న డబ్బుల విడుదల

ఈ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయనున్న ప్రభుత్వం, ఈకేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని కోరుతోంది. జూన్ 20న రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

56
అర్హత చెక్ చేసుకునే సౌలభ్యం

అన్నదాత సుఖీభవ పథకం విషయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. కేవలం కొద్ది మందికే ఈకేవైసీ అవసరమని స్పష్టత ఇవ్వడం, "Check Status" వంటి ఆప్షన్ల ద్వారా అర్హత చెక్ చేసుకునే సౌలభ్యం కల్పించడం, రైతులపై ఉన్న భారం తగ్గించేందుకు కీలక చర్యలుగా చెప్పొచ్చు.

66
ఈకేవైసీ ప్రక్రియ

ఈలోగా అవసరమైన ఈకేవైసీ ప్రక్రియను 1.45 లక్షల మంది రైతులు పూర్తిచేయాలని సూచించింది. మొత్తం మీద, రైతులకు ఇబ్బందులు లేకుండా పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories